Hyderabad: ఎంపీ అరవింద్ కు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి ఎమ్మెల్సీ కవిత గారిపై పోటీ చేసి గెలవాలని నిజామాబాద్ జిల్లా జాగృతి నాయకులుడిమాండ్ చేశారు. ఇన్నాళ్లు ఎమ్మెల్సీ కవిత గారి సహనాన్ని పరీక్షించారని ఇక ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు. ఇకనైనా అరవింద్ తీరు మార్చుకోకుంటే అన్ని గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలోని ధర్నా చౌక్ లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవితపై అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన పద్ధతి మార్చుకోకుంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. పసుపు రైతులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జిల్లాలో ఎక్కడ పర్యటించిన అరవింధ్ ను అడ్డుకొని తీరుతామని చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు మతి లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు, నరాల సుధాకర్, టిఆర్ఎస్ నేతలు ప్రభాకర్, అలీం తదితరులు పాల్గొన్నారు