PM మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే……ఇదిగో

పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం

జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం

54 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం

పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం

పీఎం స్వనిధి ద్వారా 1 లక్షా 3 వేల మందికి లబ్ది

స్వచ్ఛ భారత్ ద్వారా 30 లక్షల టాయిలెట్ల నిర్మాణం

తెలంగాణకు 7 కోట్ల 76 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రజలకు కేంద్రం చేసిన మేలుపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని మీడియాకు వినతి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, కట్టా సుధాకర్ తోపాటు ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, వీరెళ్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనపై ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. అట్లాగే ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ ప్రత్యేక వెబ్ సైట్ ను విడుదల చేశారు. 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యాల్లోని ముఖ్యాంశాలు…

• కేంద్రంలో నరేంద్రమోదీ గారి 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘‘మహాజన సంపర్క్ అభియాన్’’ పేరుతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ కేంద్రం చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి నుండి జూన్ నెలాఖరు వరకు తెలంగాణలో అనేక కార్యక్రమాలను రూపొందించాం. అన్ని జిల్లాల్ల్లోని నేతలంతా ఈ కార్యక్రమాలను అమలు చేయాలి. అందులో భాగంగా…

• జూన్ 1 నుండి 7 వరకు… పార్లమెంట్ వారీగా మీడియా సమావేశాలు నిర్వహించాలి. సోషల్ మీడియా ఇంటారాక్షన్స్ నిర్వహించాలి. వికాస్ తీర్థ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సందర్శించాలి.

• జూన్ 8 నుండి 14 వరకు… అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకుల సమ్మేళనం నిర్వహించాలి. అట్లాగే అసెంబ్లీ వారీగా మోర్చాల సంయుక్త సమ్మేళనం నిర్వహించాలి. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులతో అత్మీయ సమావేశం నిర్వహించాలి.

• జూన్ 15 నుండి 21 వరకు… రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 5 వేల మందికి తగ్గకుండా సభలు నిర్వహించాలి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న అన్ని మండలాల్లో ఘనంతా యోగా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలి.

• జూన్ 22 నుండి 28 వరకు…. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందిన వారిని గుర్తించి శక్తి కేంద్రాల వారీగా వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలి. అట్లాగే గడప గడపకు బీజేపీ పేరుతో ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలపై విస్త్రత ప్రచారం నిర్వహించాలి. ఇంటింటికీ కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేయాలి. శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినమైన జూన్ 23న ప్రతి పోలింగ్ బూత్ లో కార్యక్రమాలు నిర్వహించాలి. జూన్ 25న ప్రతి పోలింగ్ బూత్ లో ‘‘మన్ కీ బాత్’’ నిర్వహించాలి.

• ఇక 9 ఏళ్లలో మోదీ గారి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్బుతం. అందులో ముఖ్యమైన నాలుగైదు అంశాలను మాత్రమే ప్రస్తావిస్తాను. మీకు తెలుసు. మోదీ గారు రాకముందు దేశంలో ఒకే కుటుంబ పాలన కొనసాగింది. ‘‘అప్నా పరివార్… అప్నా వికాస్’’ పేరుతో దేశాన్ని లూటీ చేశారు. 2జీ స్కాం, బోగ్గు స్కాం సహా ఎటు చూసినా అవినీతి కుంభకోణాలే. మోదీ గారు వచ్చాక మచ్చ లేని అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. నాడు ఒక కుటుంబమే రాజ్యమేలితే… మోదీ గారికి 140 కోట్ల భారతీయులే తన కుటుంబమైంది. రాజ్ పథ్, కర్తవ్య పథ్, రేస్ కోర్సులు పోయి… ఇయాళ లోక కళ్యాణ్ మార్గ్ గా మారింది. ప్రధానమంత్రి ప్రజలకు ప్రధాన సేవకుడిగా మారారు. నేను ప్రధానమంత్రిని కాదు… ప్రధాన సేవకుడిని అంటూ మోదీ గారు పాలనలో నూతన ఒరవడి సృష్టించారు…

• ‘‘ఇండియా ఫస్ట్’’ అనేది మోదీ గారి వైఖరి… ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా… ఏ కార్యక్రమం చేపట్టినా… ఏ నిర్ణయం తీసుకున్నా…. నూటికి నూరుపాళ్లు దేశం కోసమే… కులమతాలకు… భాషాబేధాలకు అతీతంగా పనిచేస్తూ పేదలు, అణగారిన వర్గాలు, వివక్షకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు…

• గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు. మన తెలంగాణలో 55 లక్షల మందికి రేషన్ ఉచితంగా అందిస్తున్నారు. పీఎం అవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు నిర్మించి నిలువ నీడలేని వాళ్లందరికీ గూడు కల్పిస్తున్నారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం పేరుతో ఏం జరుగుతుందో మీకు తెలుసు. కేంద్రం రాష్ట్రానికి 3.5 లక్షలకుపైగా ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో 2.5 లక్షల ఇండ్లు అర్బన్ ఆవాస్ యోజక కింద 4 వేల 466 కోట్లు మంజూరు చేస్తే… ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు కూడా పూర్తి చేయలే. అవి పూర్తి చేస్తే మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోవడం లేదు.

• స్వచ్ఛ భారత్ కింద 11.72 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు… తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా నేటికీ చీకట్లోనే మగ్గుతున్న 2 కోట్ల 86 కోట్ల కుటుంబాలను గుర్తించి సౌభాగ్య పథకం కింద కరెంట్ వెలుగులను ప్రసరింపజేశారు. ఇందులో తెలంగాణలో 5 లక్షల 15 వేల ఇండ్లకు కరెంట్ సౌకర్యం కల్పించారు. ఉజ్వల యోజన కింద 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు అందించారు. తెలంగాణలోని ఆడపడచులకు కట్టెల పొయ్యి బాధ లేకుండా 11 లక్షల 50 వేల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించారు.

• 29 కోట్ల 75 లక్షల మంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద లబ్ది పొందుతున్నారు. 13 కోట్ల 53 లక్షల మంది పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పరిధిలోకి వచ్చారు… జల్ జీవన్ మిషన్ కింద 11.88 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నారు. సమృద్ధిగా కరెంటు… ఇలా చెప్పుకుంటూ పోతే పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి..

• అసెంబ్లీ వారీగా 119 బహిరంగ సభలు నిర్వహిస్తాం. దీంతోపాటు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతించాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాం.

• మోదీ సాధించిన విజయాలు, అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలపైనే జనంలోకి వెళతాం. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదాన్ని విజయవంతం చేయలేకపోయింది. బీజేపీ ఆ నినాదాన్ని సాకారం చేస్తోంది.

• అట్లాగే కేంద్రం రూపాయి విడుదల చేస్తే 15 పైసలే లబ్దిదారుడికి చేరుతుందని ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పారు. అవినీతికి తావులేకుండా డీబీటీ విధానం రూపాయికి రూపాయి విడుదల చేస్తే నేరుగా లబ్దిదారులకు అందుతోంది.

BJP state president Bandi Sanjay unveiled a special song on PM Modi’s 9-year rule

Hyderabad: Telangana Bharatiya Janata Party president and Karimnagar MP Bandi Sanjay Kumar on Wednesday challenged the All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) to contest in all the seats in Telangana, if it had guts to do so.

Sanjay was reacting to a statement made by AIMIM president and Hyderabad MP Asaduddin Owaisi that as long as his party existed in the state politics, it would not allow the BJP, which he described as a venomous serpent, to come to power in the state in the next assembly elections.

“Owaisi’s statement clearly shows that the Bharat Rashtra Samithi led by chief minister K Chandrasekhar Rao, is a useless party and its steering is in the hands of the MIM. Otherwise, how can the MIM dare say that it will not allow the BJP to come to power?” he asked, while speaking to reporters, at Karimnagar.
The BJP president said the MIM had no capacity to come to power on its own and its only objective was to make money by blackmailing the party, whichever was in power. “It has no love lost for the Muslims. If it has so much concern for the Muslims, why is it not bothered about the development of old city of Hyderabad? Why are Muslims not getting jobs and passports? All the while, Owaisi is interested in protecting and multiplying his assets,” he said.

Sanjay wondered why the MIM had so much interest in the BRS. “Instead of making tall statements sitting in Darus-us-Salam, why can’t the MIM contest all the seats in Telangana? If it does, we shall see that it wont’ get even deposits,” he criticised.

Stating that the Muslims themselves had no faith in the MIM, Sanjay demanded that before criticising the BJP, Owaisi should first answer what he would say about his brother’s comment that he would settle the numbers of Hindus, if he was given 15 minutes’ time.

“A terrorist leader is working in your hospital. Your party is a haven for terrorists and it argues for securing bail for terrorists. Your party doesn’t want to grow on its own and come to power. We are ready – whether you contest on your own or in alliance with other parties. The BJP fights them single-handedly, like a lion,” he challenged.

Sanjay thanked the Tirumala Tirupati Devasthanams for taking up construction of a temple for Lord Venkateshwara at Padmanagar in Karimnagar. He attended the Bhumi Puja ceremony of the temple and received blessings from Vedic pundits.

Later in the evening, Sanjay released a special song made on the nine-year rule of Narendra Modi government at the Centre, at a programme held at BJP state headquarters in Hyderabad. He also released a special website on “Mahajan Sampark Abhiyan,” and asked the people to extend support to the Modi government by giving a missed call to the number: 9090902024.

Speaking to reporters later, Sanjay said the Telangana BJP had scheduled several programmes from June 1 to 30, to campaign the achievements of Narendra Modi government at every doorstep of the state under Mahajan Sampark Abhiyan programme.

He said all the BJP leaders at the district and state level will take part in this programme. There would be press conferences, social media interactive sessions and visits to the Central government projects at the parliamentary constituency level from June 1 to 7.

In the subsequent week, similar programmes would be held at the assembly constituency level, besides holding meetings with like-minded people. From June 15 to 21, there would be public meetings at all the assembly constituencies, mobilising not less than 5,000 people for each meeting. On June 21, the party leaders would take part in the Yoga Divas programme.

From June 22 to 28, the BJP leaders would identify the beneficiaries of the Central government schemes and hold Atmeeya Sammelanams with them, besides taking the schemes to every door step, Sanjay added.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X