బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధులు, చేపట్టిన కార్యక్రమాలను రాణి రుద్రమదేవి సభలో చదివి వినిపించారు…

హైదరాబాద్: బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధులు చేపట్టిన కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి SRR కళాశాల బహిరంగ సభలో చదివి వినిపించారు…ఆ వివరాలీలా ఉన్నాయి..

రెండేళ్లపాటు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచమంతా అతలాకుతలమైన సంగతి అందరికీ తెలిసిందే. భారత దేశ ఆర్దిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన విషయం విదితమే. ఖర్చులను తగ్గించుకునేందుకు చివరకు కేంద్రం ఎంపీ లాడ్స్ నిధులను కూడా నిలిపివేసింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బండి సంజయ్ ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తనను ఎన్నుకున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తపించే వారు. అందులో భాగంగా రోడ్లు, రైల్వే లేన్లు, స్మార్ట్ సిటీ, పీఎంజీఎస్ వై సహా వివిధ కార్యక్రమాల కోసం గత మూడేళ్లలో రూ. 5,458 కోట్ల నిధులు కేంద్రం నుండి రాబట్టగలిగారు. అందులో ప్రధానంగా రోడ్ల విస్తరణ కోసం తీసుకొచ్చిన నిధులే అత్యధికంగా ఉండటం గమనార్హం.

ఏయే కార్యక్రమాలు, అభివ్రుద్ధి పనుల కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చారంటే…

సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద రూ.205 కోట్లు, ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 5 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద (ఎంఆన్ఆర్ఈజీఎస్) రూ.5.33 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద రూ.116 కోట్లు, కరీంనగర్ –వరంగల్ రోడ్ మరమ్మతు కోసం రూ. 40.9 కోట్లు, ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.578.85 కోట్లు, సెంట్రల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ టూల్ డిజైన్ కోసం రూ.19.86 కోట్లు, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.100 కోట్లు, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1.6 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం రూ.196 కోట్లు, రూర్బన్ ఫండ్స్ రూ.30 కోట్లు, ఇతర రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.109.6 కోట్లు, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ ఎక్విప్ మెంట్స్ కోసం రూ.3 కోట్ల నిధులను వెచ్చించారు. ఇవన్నీ కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివ్రుద్ది పనుల కోసం తీసుకొచ్చిన నిధులు మాత్రమే. గెలిచిన కొద్దిరోజుల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ… రాష్ట్రమంతటా తిరగాల్సిన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కరీంనగర్ అభివ్రుద్ధి కోసం నిరంతరం క్రుషి చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో అస్తవ్యస్తంగా మారిన కరీంనగర్ –వరంగల్ రోడ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుండటం… మరెంతమంది మ్రుత్యవాత పడుతుండటంతో హుటాహుటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై పరిస్థితిని వివరించి ఆ రోడ్డు మరమ్మతు కోసం 24 గంటల్లోనే రూ.40.9 కోట్ల నిధులను మంజూరు చేయించడం గమనార్హం.

ఇక విద్యా రంగం విషయానికొస్తే… సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న శాతవాహన యూనివర్శిటీకి 12-బి స్టేటస్ తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ దే. అట్లాగే ఎస్సారార్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చారు. కరీంనగర్ లో రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటులో బండి సంజయ్ పాత్ర మరువలేనిది. ఇతర జిల్లాలు ఈ విషయంలో పోటీ పడ్డప్పటికీ కరీంనగర్ కు సైనిక్ స్కూల్ తీసుకురావడంలో ఎనలేని క్రుషి చేశారు.

కోవిడ్ టైంలో ‘నేనున్నానంటూ…. ఆపన్న హస్తం అందిస్తూ…

కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రమంతటా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. కరోనా రోగులను కలిసేందుకు… ఆయా ఆసుపత్రుల దరిదాపుల్లోకి వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించని రోజుల్లోనూ బండి సంజయ్ కరోనా రోగులకు సేవలందించడంలో అగ్రభాగాన నిలిచారు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో విస్త్రతంగా పర్యటించారు. రోగులను నేరు గా పరామర్శించారు. కరోనాతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేలాదిమందికి రెమిడిసివర్ ఇంజక్షన్లను, పీపీఈ కిట్లను అందజేసి ప్రాణం పోశారు. జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లుసహా ఎంతోమంది పేదలు ఈ జాబితాలో ఉన్నారు. బీజేపీ సురక్షా పేరిట వేలాది మందికి ఉచితంగా కాన్సట్రేటర్స్, రక్త దానం చేశారు. కరోనా సమయంలో మొట్టమొదటి సారిగా ఎంపీ ల్యాడ్స్ నుండి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలను అందజేసిన ఘనత బండి సంజయ్ కే దక్కుతుంది.

గత నాలుగేళ్లలో కేంద్ర పథకాల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేకూరిన ప్రయోజనాలు (హెడింగ్)
(పాయింట్స్)

• రూ. 4624.86 కోట్లతో వివిధ జాతీయ రహదారుల నిర్మాణం
• రూ.216 కోట్ల CRIF (కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి) నిధులతో వివిధ రహదారుల నిర్మాణం, విస్తరణ
• రూ.100 కోట్లతో తీగలగుట్టపల్లిలో ROB నిర్మాణం
• రూ.612 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులు
• గ్రామీణ సడక్ యోజన కింద రూ.30.39 కోట్లతో గ్రామీణ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం
• ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.73.15 కోట్లు
• పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద రూ.22,40,000
• పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.755.62 కోట్లు విడుదల… 3,97,737 రైతులకు ప్రయోజనం
• దీపం పథకం కింద 80,492 మంది పేదలకు, ఉజ్జ్వల యోజన కింద 49,431 మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్
• సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD) కోసం రూ.20 కోట్లు
• ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (PMEGP) కింద 1285 యూనిట్ల ఏర్పాటు, వీటికి రూ.43.22 కోట్ల ఆర్థిక సాయం
• సర్వశిక్ష అభియాన్ కింద రూ.46.95 కోట్లు
• మధ్యాహ్న భోజన పథకానికి రూ.19.96 కోట్లు
• దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన కింద రూ.9.78 కోట్లు
• గ్రామీణ కౌశల్య యోజన కింద రూ.38.5 కోట్లు
• పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులకు రూ.31.66 కోట్ల విలువ గల రుణాలు
• అమృత్ పథకం కింద రూ. 1.17 కోట్లు
• స్మార్ట్ సిటీ కింద రూ. 194 కోట్లు
• స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.3.53 కోట్లు
• కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు విడుదలైన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 36.84 కోట్లు
• నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 103 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు సహా వైద్య సంబంధిత సహాయం

ఇవికాక

తన పుట్టినరోజు సందర్భంగా 2021లో సొంత ఖర్చులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువ గల వైద్య పరికరాల వితరణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X