हैदराबाद : योग गुरु रामदेव बाबा ने कहा कि दयानंद सरस्वती आधुनिक ऋषि आर्य समाज के संस्थापक हैं जिन्होंने लोगों को वैदिक मार्ग दिखाया। महर्षि दयानंद सरस्वती की द्विशत जयंती महासभा और आर्य समाज के 100 साल पूरे होने का समारोह शनिवार को नलगोंडा जिले के रामगिरी में आर्य समाज मंदिर में आयोजित किया गया। आर्यप्रतिनिधि सभा के तत्वावधान में आयोजित कार्यक्रम में रामदेव बाबा मुख्य अतिथि के रूप में शामिल हुए।
इस अवसर पर रामदेव बाबा ने कहा कि महर्षि दयानंद सरस्वती का दिखाया हुआ मार्ग सर्वमान्य है। उन्होंने सरकार से पुराने गुरुकुलों को और विकसित करने और नये गुरुकुल शुरू करने की मांग की। उन्होंने कहा कि युवाओं और विद्यार्थियों में आध्यात्मिक भावना विकसित करें। याद दिलाया गया कि महर्षि दयानंद सरस्वती ने भारतीय रूढ़िवादिता को संरक्षित करने के लिए आर्य समाज की स्थापना की थी। इसकी रक्षा करना सभी की जिम्मेदारी है। उन्होंने कहा कि वह नलगोंडा आकर खुश हैं।
दयानंद सरस्वती की जयंती समारोह के दौरान वैदिक स्कूल के छात्रों का नृत्य प्रदर्शन प्रभावशाली रहा है। छात्रों के साथ-साथ विभिन्न राज्यों से आए युवाओं ने आखाड़ा, तलवारबाजी और विभिन्न करतब दिखाए। उत्तर प्रदेश, दिल्ली, राजस्थान के गुरुकुलों, हैदराबाद के मलकपेट और देहरादून के गुरुकुलों के विद्यार्थियों ने यज्ञ किया।
संबंधित खबर:
रामदेव ने सनातन धर्म पर कई पुस्तकें प्रकाशित कीं। दयानंद सरस्वती ने शहर की प्राचीन सड़कों पर एक जुलूस निकाला। वैदिक गुरुओं के संचालक स्वामी प्रणयानंद स्वामी, दिल्ली सार्वदेशिक आर्य प्रतिनिधि सभा के स्वामी आर्यवेश, आर्य समाज मंदिर के प्रदेश अध्यक्ष विट्ठल राव और जिला अध्यक्ष बोइनापल्ली कृष्णा रेड्डी ने भाग लिया।
ఆర్య సమాజ్ రక్షణ అందరి బాధ్యత: రాందేవ్‌బాబా
హైదరాబాద్ : ప్రజలకు వేద మార్గాన్ని చూపిన ఆధునిక మహర్షి ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి అని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. శనివారం నల్గొండ జిల్లా రామగిరిలోని ఆర్య సమాజ్ మందిరంలో మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి మహాసభలతోపాటు ఆర్య సమాజ్100 ఏండ్ల వేడుకలు నిర్వహించారు. ఆర్యప్రతినిధి సభ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ప్రాచీన గురుకులాలను మరింత అభివృద్ధి చేయటంతోపాటు కొత్త గురుకులాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా యువత, విద్యార్థులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలని చెప్పారు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారని గుర్తుచేశారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాందేవ్ బాబా పేర్కొన్నారు. నల్గొండకు రావడం సంతోషంగా ఉందన్నారు.
దయానంద సరస్వతి జయంతి వేడుకల్లో వేద పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యువత కర్రసాము, కత్తిసాముతో పాటు వివిధ విన్యాసాలు చేశారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్ లోని మలక్ పేట్, డెహ్రడూన్ రాష్ట్రాల్లోని గురుకులాల స్టూడెంట్లు యజ్ఞాన్ని నిర్వహించారు.
సనాతన ధర్మాన్ని తెలియజేసే పలు పుస్తకాలను రాందేవ్ ఆవిష్కరించారు. పట్టణంలో పురవీధుల గుండా దయానంద సరస్వతి శోభాయాత్ర నిర్వహించారు. వైదిక గురుకుల సంచాలకులు స్వామి ప్రణయానంద స్వామి, ఢిల్లీ సర్వదేశిక ఆర్య ప్రతినిధి సభ స్వామి ఆర్యవేశ్, ఆర్య సమాజ్ మందిర్ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ రావు, జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. (ఏజెన్సీలు)