హైదరాబాద్: మేడ్చల్ (తెలంగాణ) జిల్లాలోని చెంగిచర్ల ఘటనలో అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు. బీజేపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ జిల్లా న్యాయస్థానం.
చెంగిచర్లలో తమ విధులకు ఆటంకం కల్పించడంతోపాటు గాయపర్చారని నాచారం సీఐ ఇచ్చిన ఫిర్యాదుతో 5గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు.
బీజేపీ లీగల్ సెల్ కు అభినందనలు తెలిపిన బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలతో పాటు చేంగిచర్ల ఘటనలో పేదలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్. (ఏజెన్సీలు)