ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రస్తుత భారతదేశం. ఫ్యూడల్ దోపిడి సంబంధాల సమాజం నిర్మూలన జరిగి ఈ దేశానికి మంచు పర్వతాలూ, అమావాస్య పౌర్ణమి ఆటు పోటులకు ఎగసి పడుతు మహా సముద్రాల అలలను దాటి వచ్చిన సామ్రాజ్యవాద బ్రిటిష్ దేశం నుండి స్వతంత్రం లభిస్తే అన్ని కులాలకు, అన్ని మతాలకు, పేదలకు ధనికులకు మధ్య అంతరాలు నశిస్తాయని అప్పటి దాకా ఉన్న రాజరిక రాజ్యాలను ఇండియాలో విలీనం చేశారు రాజులకు రాజ భరణాలు చెల్లించుకుంటూ. (రాజ భరణం అంటే రాజులు వారి రాజరిక సంస్థానాలను ఇండియాలో విలీనం చేసినందుకు ప్రజలు కట్టిన పన్నులను రాజులకు చెల్లించడం)
ప్రపంచ దేశాల చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తి
భారతదేశానికి స్వతంత్రం రావడం అంటే? దేశానికి విముక్తి కల్పించడం, ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం మరియు నగ్నంగా ఉన్న ప్రజలకు దుస్తులు ధరించడం, ప్రతి భారతీయుడు తన సామర్థ్యానికి అనుగుణంగా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని స్వతంత్రం వచ్చిన కొత్తలో నాస్తికుడుగా, ప్రపంచ దేశాల చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తిగా ప్రచారం పొందిన మొట్టమొదటి భారత ప్రధాని నెహ్రూ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏ సంస్కృతిని వారు గౌరవించదలచుకోలేదు
తన కుచ్చు టోపీ మర్మమేమిటో చెప్పినప్పటికి శ్రమ దోపిడీ లేని మరో ప్రపంచం సాధ్యమే అని ప్రపంచానికి చాటిన కారల్ మార్క్స్ ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకున్న భగత్ సింగ్ తన ఆత్మ బలిదానం ద్వార సాధించుకున్న స్వతంత్రం ఉత్తర మధ్య భారత బ్రహ్మనీయుల చేతుల్లోకి వెళ్లింది. ఇక అప్పటి నుండి ఉత్తర భారత రాజకీయాలు తనను కానీ ఏ సంస్కృతిని వారు గౌరవించదలచుకోలేదు.
ఇది కూడ చదవండి-
పేటెంట్ హక్కుగా మారింది
దేశం నలుమూలల నుండి ప్రజల శ్రమల చుక్కల ద్వారా వెళ్ళిన పన్నులు మొత్తం ఉత్తర మధ్య భారతంలో వినియోగించడం జరుగుతుంది. దేశ రాజకీయ నాయకత్వం మొత్తం ఉత్తర మధ్య భారత రాజకీయ నాయకులకు పేటెంట్ హక్కుగా మారింది. దేశంలో కేంద్ర ప్రభుత్వ అధినంలో ఉండే సంస్థలు పూర్తిగా ఉత్తర మధ్య భారతంలో ఏర్పాటు చేస్తూ దేశంలోని ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలను కేటాయించకుండా ఇక్కడి ప్రాంతాలను అభివృద్ధి నిరోధక ప్రాంతాలుగా మార్చివేశాయి.
హిందీ భాష గొప్పదనే గర్వం “ఉత్తర – మధ్య భారతీయుల”లో అధికంగా ఉంటుంది
స్వతంత్రం వచ్చిన కొత్తలో ఉత్తర మధ్య భారతీయ బ్రహ్మనులు అధికారం కోసం దేశంలోని ప్రజలకు సకల సాస్త్రాలు సారంగ నీతులు వల్లించారు. దేశంలోని ప్రజలు మాట్లాడే అన్ని భాషలకు సమానమైన ప్రాతినిధ్యం ఉంటుందని చెప్తునే హిందీ భాషను జాతీయ భాషగా గుర్తింపు తీసుకురావాలని నేటికి ప్రయత్నం చేస్తునే ఉన్నారు. పార్లమెంటు సమావేశాలలో ఇక్కడి పార్లమెంటరీ సభ్యులు హిందీలో మాట్లాడుతుంటే (?) తెలంగాణ నుండి వచ్చిన వారు “వచ్చిరాని హిందీ” మాట్లాడతారనీ మనుషులకు కాకుండా భాషకే పుట్టానని భావించుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పార్లమెంటు సభ్యులను కించపరిచడం దక్షిణభారత ప్రజలు ఎన్నటికి మరచిపోలేరు.
తనది కాని సంస్కృతిని తనదిగా భావించుకోవాలని ఆజ్ఞలు జారీ చేయడం
నేడు భారతీయులందరూ ఉత్తర భారత సంస్కృతి పాటించాలని బలవంతపు వత్తిడిలు తెస్తున్నారు. దక్షిణ భారతీయులు గత వందల సంవత్సరాలగా తింటున్న ఆహారాలపై, కట్టే బట్టలపై, మాట్లాడే భాషలపై పెత్తనం చెలాయిస్తూ తనది కానీ ఒక సంస్కృతిని తనదిగా భావించుకోవాలని సూచిస్తూ చివరకు మనం కనే కళలు కూడా ఉత్తర భారత సంస్కృతిలో ఉత్తర భారత భాషలో ఉండాలని లేకపోతే మీరు భారతీయులు కారు విదేశీయులని ముద్ర వేస్తుంది. ఒకే జాతి పేరుతో ఇతర జాతుల మనుషులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సృష్టించిన విద్యుత్‌ను ఉపయోగించి, విద్యుత్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఉష్ణోగ్రతలలో మనుషులను బూడిద చేసిన ఆధునిక ప్రపంచపు నియంత హిట్లర్. నేడు ఉత్తర భారతీయులు కూడా ఇతర మతాలను, ఇతర భాషలనూ, ఇతర ఆదివాసీల సంస్కృతులను ఒప్పుకోవడం లేదు. అలాంటి ఆలోచనలో భాగమే మణిపూర్ మారణహోమం.
యూరోపియన్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉత్తర మధ్య భారతానికే పరిమితం చేశారు. ఒక్కప్పుడు మానవ సమాజం రవాణాగా ఉపయోగించే గుర్రాలపై రెండువైపులా తాల్వార్లు తిప్పి నిలబెట్టుకున్న రాజరికపు రాజ్యాలనూ మధ్యయుగాల శారీరక శ్రమలను తల తన్నిన యూరప్ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి దిగుమతి చేసుకున్న భారత ప్రభుత్వం ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నెలకొల్పిన భారీ పరిశ్రమలు అధిక మొత్తంలో ఉత్తర మధ్య భారతంలోనే నెలకొల్పుతూ దక్షిణ భారతీయులకు డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి భక్తిపై మక్కువ పెంచుకొమ్మని సూచనలు చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలు ఐక్య సంఘటనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటను మంనం సాధించుకోవాలి, లేని పక్షంలో మనకు జరిగిన, జరుగుతున్న ప్రతి అన్యాయానికి శాంతియుత ఉద్దమంతో ఎదిరించాలి. అవసరం అయితే దీర్ఘకాలిక ఉద్తమాన్ని నిర్మించాలి. అప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.
గుండమల్ల సత్యనారాయణ
8919998619