हैदराबाद : अमेरिका में राष्ट्रपति पद का चुनाव 5 नवंबर को होना है। इसी क्रम में शिकागो में डेमोक्रेटिक नेशनल कन्वेंशन में कमला हैरिस ने अपनी उम्मीदवारी को आधिकारिक तौर पर स्वीकार किया। इस दौरान कमला ने लोगों को यह आश्वस्त करने की कोशिश की कि वह एक उम्मीद हैं। कमला हैरिस जब भाषण देनें आईं तो काफी देर तक लोग तालियां बजाते रहे। उन्होंने लोगों को रोका तब जाकर वह अपना भाषण शुरू कर सकीं। कमला हैरिस ने भाषण की शुरुआत अपने पति डग एम्हॉफ को शादी की 10वीं सालगिरह की शुभकामनाओं के साथ की। इसके अलावा उन्होंने अपनी भारतीय मां श्यामला गोपालन का जिक्र किया। उन्होंने यह भी माना कि उनकी उम्मीदवारी बेहद अजीबोगरीब हालात में हुई है।
उपराष्ट्रपति कमला ने लोगों को बताया कि आखिर उनकी मां ने उनकी परवरिश कैसे की। उन्होंने अपनी मां को एक शानदार ‘5 फुट लंबी भूरी महिला’ के रूप में वर्णित किया। उन्होंने बताया, “वह सख्त थीं, एक रास्ता दिखाने वाली थीं। उन्होंने हमें सिखाया कि अन्याय के बारे में शिकायत न करें बल्कि इसके लिए आवाज उठाएं। उन्होंने हमें सिखाया कि कभी आधे-अधूरे मन से कुछ भी नहीं करना चाहिए। और वह खुद इसका एक उदाहरण हैं।” कमला हैरिस ने भाषण के दौरान लोगों से कहा कि वह उम्मीदवारी स्वीकार करती हैं।
राष्ट्रपति उम्मीदवार कमला हैरिस ने अपने उस सफर के बारे में बताया जिसके जरिए वह एक वकील बनीं। साथ ही कमला हैरिस ने शिकागो में डेमोक्रेटिक नेशनल कन्वेंशन में राष्ट्रपति पद के लिए अपनी पार्टी का ऐतिहासिक नामांकन स्वीकार कर लिया। उन्होंने कहा, “लोगों की ओर से, प्रत्येक अमेरिकी की ओर से, पार्टी, नस्ल, लिंग या उनके मूल की परवाह किए बिना, मेरी मां की ओर से और उन सभी लोगों की ओर से जो कभी अपनी यात्रा पर निकले हैं, जिनकी कहानी पृथ्वी के सबसे महान राष्ट्र में ही लिखी जा सकती है। मैं संयुक्त राज्य अमेरिका की राष्ट्रपति बनने के लिए आपका नामांकन स्वीकार करती हूं।” उनके इतना कहते ही लोग झूम उठे। (एजेंसियां)
Also Read-
అమెరికన్లకు కమల ఎమోషనల్ కామెంట్స్
హైదరాబాద్ : అమెరికాలో అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను కమలా హారీస్ అధికారికంగా ఆమోదించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కాగా, కమలా హారీస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు. ఈ సమావేశం చికాగో యునైటెడ్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ..‘అమెరికన్ ప్రజల తరపున అధ్యక్షుడిగా మీ నామినేషన్‌ను నేను అంగీకరిస్తున్నాను. ఈ ఎన్నికలతో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. మన దేశంలో ద్వేషం, విభజన పోరాటాలను అధిగమించడానికి మంచి అవకాశం వచ్చింది. ఒక కొత్త మార్గంలో అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను.
దేశాన్ని పార్టీలకు, స్వయం ప్రతిపత్తికి అతీతంగా ఉంచుతాను. పవిత్రమైన అమెరికా ప్రాథమిక సూత్రాలను శాంతియుత బదిలీకి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తారు. ఆయనకు విశ్వసనీయత ఉండదు అంటూ కామెంట్స్ చేశారు.
మన ప్రత్యర్థులు ప్రతీరోజూ అమెరికాను కించపరుస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. నాటోను విడిచిపెడతానని ట్రంప్ బెదిరించారు. అతను పుతిన్‌ను మా మిత్రదేశాలపై దాడి చేయమని ప్రోత్సహించాడు. రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ఐదు రోజుల ముందు నేను జెలెన్‌స్కీని కలిశాను. నాటో మిత్ర దేశాలకు నేను అండగా ఉంటాను. అలాగే, గాజా-ఇజ్రాయెల్ అంశంలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హమాస్ అనే ఉగ్రవాద సంస్థ కలిగించిన భయానక స్థితిని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ ఎదుర్కోకూడదు. తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కు కోసం ఎల్లప్పుడూ నిలబడుతాను. గాజాలో జరిగినది వినాశకరమైనది అని అన్నారు. ఇక, ప్రపంచంలోనే అత్యంత బలమైన పోరాట శక్తిని అమెరికా ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూస్తాను. దేశ దళాలను, వారి కుటుంబాలను సంరక్షించే మా పవిత్ర బాధ్యతను నేను నెరవేరుస్తాను. కమాండర్ ఇన్ చీఫ్‌గా వారిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారి సేవ మరియు త్యాగాన్ని ఎప్పుడూ కించపరచను అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, నాలుగు రోజుల డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె అంగీకార ప్రసంగంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అధ్యక్షుడిగా ఆయన పాత్ర స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక, కమలా హరీస్ ప్రసంగం కొనసాగుతుండగా పార్టీ కార్యకర్తలు కమల.. కమల, అమెరికా.. అమెరికా అంటూ నినాదాలు చేశారు. మరోవైపు కమలా హారీస్‌కు జో బైడెన్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బైడెన్..‘ కమలా హారిస్ అధ్యక్ష పదవికి నామినేషన్‌ను అంగీకరించడం చూసి నేను గర్వపడుతున్నాను. ఆమె మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నందున ఆమె అత్యుత్తమ అధ్యక్షురాలు అవుతుంది అంటూ కామెంట్స్ చేశారు. (ఏజెన్సీలు)