హైదరాబాద్ : గాంధీ భవన్ లో 78వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, కోదండ రెడ్డి, కుమార్ రావ్, నిరంజన్, మెట్టు సాయి కుమార్, సేవాదల్ చైర్మన్ జితేందర్ తదితరులు పాల్గొన్నరు.
మహాత్మా గాంధీ, నెహ్రూలతో పాటు పలువురు స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో మాజీ రాజ్యసభ సభ్యుడు v.హనుమంత్ రావు. స్వాతంత్రం ఉద్యమం లో పాల్గొనని వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు.మొన్నటి వరకు స్వాతంత్రం వద్దని చెప్పినా వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు. ఆనాడు మన్మోహన్ సింగ్ రుణమాఫీ చేశారు ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం లో రుణమాఫీ అయ్యింది.
ఇది కూడ చదవండి-
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాము. రాహుల్ గాంధీ ఎస్సి ఎస్టీ బీసీ ల కోసం కుల గణన తీసుకు వచ్చారు. కుల గణన చేసిన పంచాయతీ రాజ్ ఎన్నికలు పెట్టండి. కుల గణన చేయడం వలన ఎస్సి ఎస్టీ బీసీ లకు న్యాయం జరుగుతుంది.