67 TMC allotted to Sitarama project due to Congress government’s efforts: Uttam
CM Revanth Reddy to switch on Sitarama Project’s pumps on August 15
Hyderabad: Irrigation and Civil Supplies Minister Capt N Uttam Kumar Reddy refuted claims by former minister Harish Rao that 90% of the project work was complete, calling it “ludicrous”. He asserted that only 39% of the work had been completed under the BRS government.
Uttam Kumar Reddy announced that Chief Minister Revanth Reddy will switch on the Sitarama Lift Irrigation Project’s pumps on August 15. He assured that the project would be fully operational by August 15, 2026. Uttam Kumar Reddy, along with Revenue Minister Ponguleti Srinivasa Reddy, conducted a review meeting at Jal Soudha on Tuesday to discuss the inauguration arrangements and other aspects of the project.
Also Read-
Speaking to media persons later, Uttam Kumar Reddy criticized the BRS party, questioning how 90% of the project could be completed after spending only Rs 7,230 crore out of the allocated Rs 18,231 crore. He accused the government of installing motors prematurely to earn higher commissions, even though a dry run was never conducted. He also dismissed claims that the necessary permissions from the Central Water Commission (CWC) had been obtained, stating that no such permissions had been granted.
The Seetharama Lift Irrigation Project, now fully approved by the Godavari River Management Board, will receive 67 TMC of water from the Godavari River which is an achievement of Congress government.
Uttam Kumar Reddy stated that the Sitarama Project was originally conceived as the Rajiv Sagar and Indira Sagar projects during the Congress government’s tenure. He accused the BRS of renaming the project to Sitarama to claim credit and to conceal the fact that the original projects, estimated to cost Rs 3,500 crore, could have been completed with an additional Rs 1,500 crore. He alleged that the BRS government’s negligence had led to a significant cost escalation to Rs 18,000 crore, without a corresponding increase in irrigated land.
He accused the BRS government of neglecting the irrigation system in the state and failing to utilize the allocated funds effectively. He pointed out that despite spending Rs 1.81 lakh crore over ten years, the previous government failed to bring new acreage under irrigation.
Minister Srinivas Reddy further challenged Harish Rao to ask his “uncle” (KCR) about the spirit of Khammam, where the BRS managed to win only one seat in the last three elections. He warned that the BRS would be completely wiped out in the future, attributing the solitary victory in the previous election to his own influence and the victory of his disciple. He cautioned Harish Rao against underestimating the people of Khammam.
నాటి రాజీవ్,ఇందిరా సాగర్ ప్రాజెక్టే నేటి సీతారామ సాగర్ ప్రాజెక్ట్రీ
ష్ రావు ప్రకటన చూస్తుంటేగురివింద నలుపెరగదన్నా సామెత గుర్తుకు వస్తుంది
నీటిపారుదల రంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది
పదేళ్ల వ్యవధిలో 1.81 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఏకరాల ఆయాకట్టును కొత్తగా సేద్యంలోకి తీసుకు రాలేక పోయారు
అధికారంలో ఉన్నన్నాళ్ళు బి ఆర్ యస్ కు పెండింగ్ ప్రాజెక్టులు గుర్తుకు రాలేదు
3505 కోట్లతో పూర్తి కావాల్సింది ఇప్పుడది 18,286 కోట్లకు చేరింది
నాడు349 మేఘావాట్ల అవసరం ఇప్పుడది రెండింతలు అయ్యింది
బి.ఆర్ యస్ అధికారంలోకి వచ్చిన రోజున1500 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఆయాకట్టు సాగులోకి వచ్చేది
కేసీఆర్ అధికారంలో ఉండగా 2016 లో 7,926 కోట్లు విడుదల చేస్తూ జీ. ఓ ఇచ్చారు
రీ-డిజైన్ పేరుతో బి ఆర్ యస్ ప్రభుత్వం అధికారం దిగే నాటికి అది 19 వేల కోట్లకు చేరింది.
కేవలం 39 శాతం మాత్రమే పూర్తి చేసుకున్న సీతారామ ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి అయ్యిందని హారీష్ రావు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది
ఇదంతా గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కక్కుర్తి పడింది
సీతారామ ప్రాజెక్ట్ లకు సి డబ్ల్యూసి అనుమతులు ఉన్నాయంటూ హారిష్ రావు చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు
మేమే తెచ్చామని బి ఆర్ యస్ నేతల ప్రగల్బాలలో నిజం లేదంటూ సి డబ్ల్యూ సి ఇప్పుడే ప్రకటించింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోటే అనుమతులు
మేము చేసిన కృషితోటే 65 టి యం సి ల నీటి కేటాయంపులకు ఆమోదం రాబోతుంది
మీ హయంలో పనులు జరిగింది 39 శాతమే
8,000 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కుడా నీరు ఇవ్వని నిర్వాకం మీది
87కోట్లు ఖర్చు పెట్టి 16,000 ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణతో పాటు లక్షా పదివేల ఎకరాలకు స్టీరీకరణ చేసుబోతున్నాం
యస్ ఎల్ బి సి ని నిర్లక్ష్యం చేసిన ఘనత నీటిపారుదల శాఖా మంత్రులుగా నీది మీ మామది
డిండి ని పట్టించుకున్న పాపాన పోలేదు
పాలమూరు ఎత్తి పోతల పథకాన్ని పక్కన పెట్టారు
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా,కోయిలసాగర్ లు ఎందుకు పూర్తి చెయ్యలేక పోయారు
నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టమైన్ అవగాహన ఉంది
గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి అందిస్తాం
డబ్బు ఎక్కడ మిగులుతుందో అక్కడ మాత్రమే పనులు చెందిన చరిత్ర మీది
రానున్న ఎన్నికల్లో ఒక్క సీటు మీకు దక్కదు
ఇప్పటికైనా గ్లోబెల్ ప్రచారం మానుకో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
ఆగస్టు 15 న సితారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్ లు ప్రారంభం
అదే రోజున వైరా లో భారీ బహిరంగ సభ
బి ఆర్ యస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల మండిపాటు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మార్చేందుకు ఉద్దేశించ బడిన రాజీవ్,ఇందిరా సాగర్ లే నేటి సీతారామ ప్రాజెక్ట్ అని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు స్పష్టం చేశారు.అటువంటి నీటి పారుదల రంగాన్ని ఇదేండ్లు నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న హరీశ్ రావు ఆ తరువాత ఇదేండ్లు అదే శాఖాను పర్యవేక్షించిన తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు భ్రష్టు పట్టించింది చాలక ఇప్పుడు హరీష్ రావు గ్లోబెల్ ప్రచారంతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తాపత్రయ పడుతున్నరని వారు మంది పడ్డారు.
హారిష్ రావు ప్రకటన చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవాచేశారు.ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఎర్రమంజిల్ లోని జలసౌద లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు మాట్లాడుతూ మీరు గడిచిన పదేళ్లుగా నాశనం చేసిన నీటి పారుదల రంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.మీ ప్రభుత్వం పదేళ్ళలో 1.81 కోట్లు ఖర్చు పెట్టినా సాధించిన ఫలితం శూన్యమని వారు దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు ఖర్చు చేసి కుడా లక్ష ఎకరాల ఆయకట్టును కొత్తగా సేద్యంలోకి తీసుక రాలేక పోయారని వారు విమర్శించారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు బి ఆర్ యస్ ప్రభుత్వానికి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలేదని వారు నిలదీశారు.యస్.ఎల్.బి సి,డిండి,నెట్టెంపాడు,భీమా,కల్వకుర్తి,కోయిలసాగర్ ,పాలమూరు ఎత్తి పోతాల పధకాలు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.
కేవలం 3505 కోట్లతో కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన రాజీవ్,ఇందిర సాగర్ ప్రాజెక్ట్ పూర్తి కావలసి ఉండగా కమిషన్ లకు కక్కుర్తి పడిన బి ఆర్ యస్ సర్కార్ సీతారామ ప్రాజెక్ట్ గా పేరు మార్చి రీ-డిజైనింగ్ పేరుతో ఆ మొత్తాన్ని ఏకంగా 18,286 కోట్లకు పెంచింది వారు ఆరోపించారు. నాటి ప్రతిపాదనల ప్రకారాం కేవలం 349 మేఘా వాట్ల విద్యుత్ సరిపోతుండగా మామా అల్లుళ్ళ నిర్వాకంతో ఇప్పుడు రెట్టింపు అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లో ఉండగా 2016 లో 7,926 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వమే దిగిపోయే నాటికి రీ-డిజైన్ పేరుతో 19 వేల కోట్లకు చేరడం వెనుక ఉన్న మతలబు కమిషన్ లకు కక్కుర్తి పడడమేనని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్ట్ లకు సి డబ్ల్యూ సి అనుమతులు ఉన్నాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్న మాటలు సత్యదూరంగ ఉన్నాయన్నారు మేమే తెచ్చామంటూ బి ఆర్ యస్ నేత హారిష్ రావు మాటల్లో నిజమే లేదంటూ తాజాగా సి డబ్ల్యూ సి చేసిన ప్రకటనను వారు ఉదహరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోటే అనుమతులు తుది దశకు చేరుకున్నాయని వారు వెల్లడించారు. మేము చేసిన కృషితోటే 65 టి యం సి ల నీటి కేటాయంపులు సీతారామ ప్రాజెక్ట్ కు రబోతున్నాయన్నారు.
సీతారామ ప్రాజెక్ట్ పనులు బి ఆర్ యస్ ప్రభుత్వ హయాంలో జరిగింది కేవలం 39 శాతం మాత్రమే నన్నారు.ఇప్పుడేమో అదంతా మా గొప్ప తనమే నంటూ గొప్పలు చెప్పుకుంటున్న బి ఆర్ యస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఎకరాకు నీళ్లు ఎందుకు పారించ లేక పోయారని మంత్రులు ఉత్తమ్,పొంగులేటి లు సూటిగా హరీష్ రావును ప్రశ్నించారు.ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 87 కోట్లు ఖర్చు పెట్టి 16,000 వేల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడంతో పాటు లక్షా పదివేల ఎకరాలకు సాగునీటిని స్టీరికరించ బోతున్నామన్నారు.
నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్న6 గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించి ఖమ్మం జిల్లాకు సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సంకల్పం అని వారు పేర్కొ5.డబ్బు ఎక్కడ మిగులుతోందో అక్కడ మాత్రమే పనులు చేసిన చరిత్ర బి ఆర్ యస్ ప్రభుత్వానిదని వారు విమర్శించారు.ఇప్పటికైనా గ్లోబెల్ ప్రచారం మానుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు హరీష్ రావుకు హితవు పలికారు.