BRS: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ

శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు,
తెలంగాణ రాష్ట్రం – గారికి,
నమస్కారములు !

పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనలు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడం వల్ల నిజాలు తెలియజేయలనే ఉద్దేశ్యం తోనూ, అదే విధంగా అమలు చేయవలసిన మీ హామీల తో పాటూ వెంటనే పరిష్కరించ వలసిన సమస్యలను గుర్తు చేయడానికీ, విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ లేఖ రాస్తున్నాం.

Also Read-

  1. 2017లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలలో ఇచ్చిన హామీ మేరకే 10.468 పండిత, పి.యిటీ పోస్టుల అప్ గ్రేడేషన్ కు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. మీరు నిర్వహిస్తున్న సభలో సింహభాగం వారే కావడం గమనించాల్సిందిగా సూచిస్తున్నాం.
  2. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే, భాషాపండితులకు, పి.యి. టీలకు అడ్డంకిగా ఉన్న సర్వీసురూల్స్ 11, 12లను మార్చి కొత్తగా 2,3, మరియు 9,10 జి.ఓలను అనుమతించింది.
  3. 2023 సెప్టెంబర్ 18 నాడు కాళేశ్వరం జోన్ 1 లో మా ప్రభుత్వమే 1050 గజిటెడ్ ప్రదానోపాద్యాయ ప్రమోషన్లనూ ఇచ్చింది.
  4. ప్రాథమిక పాఠశాలలకు గానూ మా ప్రభుత్వం 10.000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటివరకూ పాఠశాలలకు కేటాయించలేదు. వెంటనే కేటాయించి ఎస్ జీ టీ లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము
  5. ప్రస్తుత ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు కూడా గతప్రభుత్వమే సెప్టెంబర్ నెలలో లాంఛనాలు పూర్తిచేసింది.
    ఈరోజు వేలాది మంది ఉపాధ్యాయులతో తాము నిర్వహిస్తున్న ముఖాముఖిలో మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఈ కింది హామీలపై స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు వెలువరించి ఆదేశాలు ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బి.ఆర్.ఎస్., పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది.
  6. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి పర్యాయం 43 శాతం, రెండవ పర్యాయం 30 శాతం ఫిట్ మెంట్ ను కల్పించింది. కరోనా తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అతలా కుతలమైనా 30 శాతం పి.ఆర్.సి ప్రకటించి కే సీఆర్ గారు ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మీరు ఎన్నికల సభలలో మాట్లాడుతూ కే సి ఆర్ గారు ప్రకటించిన దానికన్నా గొప్పగా పి ఆర్ సి ని కల్పిస్తామని అన్నారు. కర్ణాటకలో పి ఆర్ సి ఇప్పటికే అమలులోకి వచ్చింది, మరి తెలంగాణలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మరింత మెరుగైన పి ఆర్ ఈ సి ఎప్పుడు అమలుచేస్తారో విస్పష్టంగా ప్రకటించాలి, మీరు మీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్ లో ఉన్న 4 డి. ఎ. లను ఎప్పుడు అనుమతిస్తారో ఆ సంగతన్నా సభలో ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారు.
  7. న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్నారు. ఎప్పటినుండి అమలుచేస్తారో సభలో ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.
  8. సర్వశిక్షా అభియాన్ లో సేవలందిస్తున్న ఉద్యోగులను మీ మాటలలో చెప్పాలంటే “చాయ్” తాగినంత వ్యవధిలో క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికీ 8నెలలు కావస్తున్నది. దాని ఊసేలేదు. వారికి ఆశలు చూపించింది మీరే కనుక వారి సమస్యను ఎప్పుడు తీర్చుతారో సభాముఖంగా ప్రకటించండి.
  9. పాఠశాలలకు స్కావెంజర్స్ ను అనుమతిస్తామన్నారు. అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి.
  10. పాఠశాలలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామన్నారు. ఇప్పటికీ దానిపై నిర్ణయం ప్రకటించలేదు. మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి వాటినీ పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.
  11. బదిలీ అయినా ఇప్పటివరకూ రాష్ట్రంలో నూతన పాఠశాలలో చేరని ఎస్.జి.టి ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి. బదిలీల వలన ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను వెనువెంటనే నియమించాలి.
  12. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలి.
  13. పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారం అందించే మంచి పథకాన్ని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.

తన్నీరు హరీశ్ రావు దేశపతి శ్రీనివాస్
సిద్దిపేట శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X