हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 में सुपर 8 के मुकाबलों का आगाज हुआ। टी20 वर्ल्ड कप 2024 में अब ग्रुप स्टेज के मुकाबले समाप्त हो चुके हैं। सुपर 8 के पहले मैच में बुधवार को अमेरिका टीम का सामना साउथ अफ्रीका से हुआ। एंटीगुआ के सर विवियन रिचर्ड्स स्टेडियम में खेले गए इस मैच में साउथ अफ्रीका ने अमेरिका को 18 रन से हराया।
टॉस हारकर पहले बल्लेबाजी करने उतरी साउथ अफ्रीका ने 20 ओवर में 4 विकेट खोकर 194 रन बनाए। क्विंटन डी कॉक ने सबसे ज्यादा 74 रन की पारी खेली। उनके अलावा एडेन मार्कराम ने 46, हेनरिक क्लासेन ने नाबाद 36 रन और ट्रिस्टन स्टब्स ने नाबाद 20 रन बनाए।
संबंधित खबर-
जवाब में अमेरिकी टीम 20 ओवर में 6 विकेट खोकर 176 रन ही बना सकी। एंड्रीज गौस ने सबसे ज्यादा 80 रन की पारी खेली। उनके अलावा हरमीत सिंह ने 38 और स्टीवन टेलर ने 24 रन बनाए। साउथ अफ्रीका की ओर से कगिसो रबाडा ने 3 विकेट लिये।
यह भी पढ़ें-
T20 World Cup 2024 : అమెరికాపై సౌతాఫ్రికా విజయం
హైదరాబాద్ : గ్రూపు దశను అజేయంగా ముగించిన సౌతాఫ్రికా సూపర్-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించింది. ఛేదనలో అమెరికా బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ టెన్షన్ పెట్టగా సఫారీలు విజయం కోసం కాస్త శ్రమించాల్సి వచ్చింది. నార్త్ సౌండ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై 18 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 194/4 స్కోరు చేసింది. డికాక్(74) మెరుపు హాఫ్ సెంచరీకితోడు మార్క్రమ్(46), క్లాసెన్(36 నాటౌట్) మెరవడంతో భారీ స్కోరు దక్కింది. అనంతరం ఛేదనకు దిగిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 176/6 స్కోరే చేసింది. ఆండ్రీస్ గౌస్(80) చెలరేగడంతో ఒక దశలో అమెరికా టెన్షన్ పెట్టినా విజయం సౌతాఫ్రికానే వరించింది. రబాడా(3/18) రాణించాడు.
195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్టీవెన్ టేలర్ వరుస బౌండరీలతో అమెరికా ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. అయితే, ఆ దూకుడు ఎంతో సేపు లేదు. 4వ ఓవర్లో టేలర్(24)ను రబాడా అవుట్ చేయగా ఆ తర్వాత అమెరికా తడబడింది. 23 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 76/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఇక అమెరికా పని అయిపోయిందనుకున్న తరుణంలో అప్పటికే క్రీజులో పాతుకపోయిన ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు ,సిక్స్‌లతో సఫారీ బౌలర్లపై విరుచుకపడ్డాడు.
మరోవైపు, హర్మీత్ సింగ్(38) కూడా ధాటిగా ఆడాడు. దీంతో అమెరికా 18 ఓవర్లలో 167/5 స్కోరుతో నిలవడంతో సౌతాఫ్రికా జట్టులో టెన్షన్ మొదలైంది. 12 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. గౌస్ దూకుడు అమెరికాకు విజయం కట్టబెట్టేలా కనిపించాడు. అయితే, 19వ ఓవర్ వేసిన రబాడా హర్మీత్‌ను అవుట్ చేయడంతోపాటు 2 పరుగులే ఇవ్వడంతో సౌతాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. గౌస్(80 నాటౌట్) చివరి వరకూ పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లతో సత్తాచాటగా మహరాజ్, నోర్జే, షంసీ చెరో వికెట్ పడగొట్టారు.
మొదట సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. హెండ్రిక్స్(11) నిరాశపర్చడంతో 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ విఫలమైనా మరో ఓపెనర్ డికాక్ మాత్రం చెలరేగి ఆడాడు. 4వ ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 28 పరుగులు పిండుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు అతను ఫోర్లు, సిక్స్‌లు బాదుతూనే ఉన్నాడు. కెప్టెన్ మార్క్రమ్ కూడా దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఈ క్రమంలో చూస్తుండగానే డికాక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరును కొనసాగిస్తున్న క్రమంలో డికాక్(74) దూకుడుు హర్మీత్ బ్రేక్ వేశాడు. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్(0) నిరాశపర్చగా కాసేపటికే మార్క్రమ్(46) అవుటయ్యాడు. ఆఖర్లో క్లాసెన్(36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(20 నాటౌట్) మెరవడంతో 190కి పైగా పరుగులు చేసింది. అమెరికాబౌలర్లలో నేత్రావల్కర్, హర్మీత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. (ఏజెన్సీలు)