हैदराबाद : रेवंत रेड्डी की सरकार ने तेलंगाना में जमीन की कीमतें बढ़ाने का अहम फैसला लिया है। क्योंकि जमीन की वास्तविक बाजार कीमत और सरकारी कीमत में काफी अंतर है। इसलिए सरकार बाजार मूल्य में संशोधन के लिए त्वरित कदम उठा रही है। इस हद तक, राज्य में कृषि और गैर-कृषि भूमि और अचल संपत्तियों के लिए नए पंजीकरण शुल्क 1 अगस्त से लागू होंगे। मालूम हो कि रेवंत रेड्डी सरकार ने हाल ही में राज्य में जमीन के बाजार मूल्यों में संशोधन करने का फैसला किया है। सीएम रेवंत रेड्डी ने अधिकारियों के साथ समीक्षा की और अहम आदेश जारी किये।
उसी के तहत मूल्य का आकलन करने के लिए स्टाम्प-पंजीकरण विभाग ने मैदानी स्तर पर गतिविधियाँ शुरू की हैं। अधिकारी पुराने बाजार मूल्य को संशोधित करने और नए मूल्य को लागू करने की शर्तों का अध्ययन करेंगे। इस महीने की 18 तारीख को इस विभाग के अधिकारी अपर समाहर्ता और आरडीओ के साथ प्राथमिक बैठक कर कार्यक्रम की शुरुआत करेंगे। चरणवार समीक्षा पूरी होने के बाद 1 जुलाई को नए पंजीकरण शुल्क को अंतिम रूप दिया जाएगा। सरकारी अधिकारियों ने घोषणा की कि उसके बाद कई चरणों में निरीक्षण पूरी होने के बाद अंतिम बाजार मूल्यों को अंतिम रूप दिया जाएगा।
स्टाम्प और पंजीकरण विभाग ने ग्रामीण क्षेत्रों और शहरी क्षेत्रों द्वारा बाजार मूल्यों के संशोधन के दौरान क्षेत्रीय स्तर पर अधिकारियों द्वारा पालन किए जाने वाले दिशानिर्देश पहले ही जारी कर दिए हैं। इस विभाग के आयुक्त नवीन मित्तल ने आदेश में स्पष्ट किया कि प्रदेश भर के राजस्व, पंचायत राज, सर्वेक्षण-भूमि अभिलेख और नगर निगम विभाग से सहयोग लिया जाए। ग्रामीण क्षेत्रों में सबसे पहले राष्ट्रीय एवं राज्य राजमार्गों पर स्थित गांवों की पहचान की जाती है। वहां गैर-कृषि उपयोग, उद्योगों, एसईजेड आदि के लिए उपयुक्त क्षेत्रों पर विचार किया जाता है। उनके आधार पर, खुली भूमि की कीमतों को ध्यान में रखते हुए बाजार मूल्य को समायोजित किया जाता है। कृषि भूमि के मामले में, अधिकारी राजस्व और पंचायत अधिकारियों के सुझाव लेने के बाद खुले बाजार की कीमतों का अनुमान लगाते हैं।
यह भी पढ़ें-
हालांकि, शहरी क्षेत्रों में, नगर पालिकाओं और निगमों में स्थानीय क्षेत्रों के आधार पर मूल्य निर्धारित किया जाता है। व्यावसायिक क्षेत्रों और मुख्य सड़कों जैसे क्षेत्रों में बाजार मूल्य उस क्षेत्र के अनुसार निर्धारित किया जाता है। आवश्यकता पड़ने पर विकसित क्षेत्रों में कालोनियों, आंतरिक सड़क क्षेत्रों, ढांचागत सुविधाओं को भी पुराने मूल्य के विरुद्ध समायोजित किया जाएगा। नगरपालिका और शहर के शासी निकायों में नए शामिल हुए गांवों में, स्थानीय मूल्य के आधार पर क्षेत्र स्तर की कीमतों के आधार पर संशोधन किया जाता है। बाजार मूल्यों का संशोधन इस महीने की 23 तारीख तक पूरा हो जाएगा और समिति 29 जून तक इसे मंजूरी दे देगी। इसके बाद 20 जुलाई तक सुझाव, सुझाव और आपत्तियां प्राप्त की जाएंगी और उनका समाधान किया जाएगा। संशोधित दरें 1 अगस्त से प्रभावी होंगी।
తెలంగాణలో భూముల ధరలు పెంపు, ఈ తేదీ నుంచే అమలు
హైదరాబాద్ : తెలంగాణలో భూముల ధరల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ వాస్తవ ధరకు.. ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండటంతో మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత మార్కెట్ విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ మీటింగ్ నిర్వహించి కార్యక్రమాన్ని షురూ చేయనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని ఈ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ముందుగా గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలపై అధికారులు అంచనాకు వస్తారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువను నిర్ధారిస్తారు. కమర్షియల్ ఏరియాలు, మెయిన్ రోడ్స్ లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు- అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరల ఆధారంగా సవరణ చేస్తారు. ఈనెల 23 వరకు మార్కె్ట్ విలువల సవరణ పూర్తి చేయనుండగా జూన్ 29 నాటికి కమిటీ ఆమోదం వేయనుంది. ఆ తర్వాత జులై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తీసుకొని వాటికి పరిష్కారం చూపనున్నారు. సవరించిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. (ఏజెన్సీలు)