అంబేద్కర్ కోరుకున్న సమానత్వం లేదు : విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్మారకోపన్యాసనికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. “అంబేద్కర్ రాజ్యాంగ వాదం – భారత పాలన” అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.
అయన మాట్లాడతూ రాజ్యంగ నిర్మాత ప్రపంచ సమానత్వాన్ని కోరుకున్నారని, అంబేద్కర్ దూర దృష్టి గల నేతగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొంచుపర్చిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. స్వాతంత్ర్యానికి పూర్వం అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని, అంటరానితనం ఆయనను బాగా ఆలోచింపచేసిందని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా అంబేద్కర్ కోరుకున్న సమానత్వం అమాజంలోని అన్ని వర్గాలకు పూర్హ్తిగా రాలేదన్నారు.
భారతీయ రాజ్యంగం పునాది అయిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం న్యాయాం అనే అంశాల పై ఆధారపడి ఉన్నాయని, ఇవి అందరూ రోజువారీ కార్యక్రమాల్లో అమలు చేయాలన్నారు. ప్రాథమిక సూత్రాలుగా భారత రాజ్యాంగ పీఠికలోకి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనల్లో, భావ వ్యక్తీకరణలో నమ్మకాలు, విశ్వాసాల్లో స్వేచ్ఛ; హోదాలు, అంతస్తులు, అవకాశాల్లో తేడాలున్న సమాజంలో అందరి మధ్య సమానత్వం సాధించాలని సూచించారు. దేశ రాజకీయాలను పరిపాలనా విభాగాలను వ్యవస్థలను, వనరులను సమానంగా అందరికీ పంచాలని అంబేద్కర్ కోరుకున్నారన్నారని దేశంలోని సంపద కొందరి వద్దే కేంద్రీకృతం అయ్యిందని ఆవేదన వ్యక్తపరచారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం అవుతోందని ప్రొ. లింబాద్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామారావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తమ విశ్వవిద్యాలయం 25 అడుగుల ఎత్తైన డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే ఆవిష్కరించుకుంటామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు యూనివర్సిటీ కట్టుబడి ఉందని వివరించారు.
ప్రభుత్వ పరిపాలన శాస్త్రం – 75 సంవత్సరాల అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల
దేశంలో ప్రభుత్వ పరిపాలన శాస్త్రం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సును మే 17-18, 2024 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. ఆర్ లింబాద్రి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె సీతారామారావు, డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెమినార్ డైరెక్టర్ ప్రొ. పల్లవి కబ్డే, కో డైరెక్టర్ ప్రొ. సి. వెంకటయ్య తదితరులు సెమినార్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి పుష్ప చక్రపాణి కార్యక్రమ ఆవశ్యకతను వివరించి ముఖ్య అతిధిని పరిచయం చేశారు. అంబేద్కర్ ఆశయాలను ముదుకు తీసుకెళ్ళడంలో విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్.రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో డా. బానోత్ లాల్; ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; విద్యార్ధి సేవల విభాగ డైరెక్టర్ డా. ఎల్వికే రెడ్డి; పుస్తక ప్రచురణల విభాగ డైరెక్టర్ ప్రొ. గుంటి రవీందర్; ఎస్సీ ఎస్టీ సెల్ ఇంచార్జ్ డా. బానోత్ ధర్మ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డా. బోజు శ్రీనివాస్, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మహేశ్వర్ గౌడ్, శర్మ, కిషోర్, గోపాల కృష్ణ, కామేశ్వరి, బుద్ధ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉద్యోగులకు నిర్వహించిన క్రీదాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందించారు.
AMBEDKAR WANTED EQUALITY : Prof. R. Limbadri, Chairman, TSCHE
BRAOU organized Dr B R Ambedkar Memorial Lecture
Hyderabad : Dr. B. R. Ambedkar Open University organized Bharat Ratna Dr. B. R. Ambedkar (Father of the Constitution of India) Memorial Lecture at its campus as part of 133rd Birthday Celebrations on April 25. Prof. R. Limbadri, Chairman, Telangana State Council for Higher Education, Government of Telangana, Hyderabad attended as the chief guest for the program and delivered a lecture on “Ambedkar’s Constitutionalism – Indian Governance”.
He said that Dr. B.R.Ambedkar has a great visionary. It was explained that the state of Telangana was formed as per Article 3 of the Constitution. It was explained that before independence, Ambedkar had faced many insults and untouchability made him think a lot. He said that even after seven decades of independence, the equality that Ambedkar wanted has not been fully achieved for all sections of Amjam. He said that the maker of the Constitution wanted global equality and said that Ambedkar was a visionary leader.
It was explained that the state of Telangana was formed as per Article 3 of the Constitution. It was explained that before independence, Ambedkar had faced many insults and untouchability made him then he think a lot. He said that even after seven decades of independence, the equality that Ambedkar wanted has not been fully achieved for all sections of Amjam. The Freedom, Equality, Fraternity and Justice, which are the foundation of the Indian Constitution, are based on these principles, which should be implemented in daily activities.
In the Preamble of the Constitution of India as basic principles, social, economic and political justice; Freedom of thought, expression of belief, freedom of belief; It is suggested to achieve equality among all in the society where there are differences in statuses, floors and opportunities. He lamented that Ambedkar wanted to distribute the country’s politics, administrative departments, systems and resources equally to all and the wealth of the country was concentrated in the hands of a few. Prof. Limbadri mentioned that now there is concern on the same issue across the country.
Prof. K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the function. Prof. Rao that on the occasion of Ambedkar Jayanti, University is setting up a 25 feet tall statue of Dr. B.R. Ambedkar and will soon unveil it in the campus. He explained that the university is committed to the aspirations of Dr. B.R.Ambedkar.
Prof. G.Pushpa Chakrapani, Director (Academic) attended as guest of honor in the program, explained the need for the program and the details of those who have delivered Ambedkar memorial lectures so far and introduced about the chief guest. She also said that the university is working hard to carry forward the aspirations of Ambedkar. Prof.A.V.R.N.Reddy, Registrar also spoke on the occasion.
Public Administration-75 Years International Conference Brochure Released
On the occasion of the completion of 75 years of public administration in the country, an International conference is being held on the chief guest Prof.R.Limbadri, Chairman, Telangana State Council for Higher Education and Prof. K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU released the brochure of International Conference on “75 Years of Public Administration Discipline in India Trajectories and Contemporary Status” May 17-18, 2024 at the University campus.
Prof. Vaddanam Srinivas, Dean, Faculty of Social Sciences; Prof. Pallavi Kabde, Seminar Director; Prof. C. Venkataiah, Co Director and others unveiled the brochure of the seminar. The program was attended by Dr. Banoth Lal; Prof. Vaddanam Srinivas, Director EMR&RC; Prof. I. Anand Pawar, Director CSTD; Dr.L.V.K. Reddy, Director LSSD, Dr. Banoth Dharma, SC/ST Cell, President of SC ST Employees Association. Dr. Boju Srinivas, directors of various departments, deans, heads of departments, teaching and non-teaching staff, representatives of unions… Maheshwar Goud, Sharma, Kishore, Gopala Krishna, Kameshwari, Buddha and others participated. Commemorations and certificates of appreciation were presented to the winners of the sports competitions organized for the employees in commemoration of Dr. B.R. Ambedkar 133rd Jayanti.