हैदराबाद : बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा की पत्नी की कार चोरी होने से हड़कंप मच गया है। घटना साउथ ईस्ट दिल्ली के गोविंदपुरी इलाके मे हुई है। ऐसा प्रतीत हो रहा है कि चोरी 19 मार्च को दोपहर 3 से 4 बजे के बीच हुई है। कार चालक जोगिंदर सर्विसिंग के लिए टोयोटा फॉर्च्यूनर लेकर आया। बाद में वह खाना खाने के लिए कार को घर के सामने पार्क किया।
लेकिन उसी वक्त अज्ञात लोग कार लूट कर ले गये। सीसीटीवी फुटेज के आधार पर पता चला कि चोरी हुई कार गुरुग्राम की ओर गई है। लेकिन पुलिस अधिकारी अब तक कार का पता नहीं लगा सके हैं। चोरी गई कार का नंबर हिमाचल प्रदेश का है। पुलिस मामला दर्ज कर घटना की जांच कर रही है।
Crme News : జేపీ నడ్డా భార్య కారు చోరీ కలకలం
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవింద్ పురి పరిధిలో చోటు చేసుకుంది. మార్చి 19న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ జోగిందర్ టొయోటా ఫార్చునర్ కారును సర్విసింగ్ కోసం తీసుకొచ్చాడు. అనంతరం డిన్నర్ చేసేందుకు ఇంటి వద్ద కారున నిలిపాడు.
అయితే ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారును ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా చోరీకి గురైన కారు గురుగ్రామ్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు పోలీసు అధికారులు కారును ట్రేస్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. చోరీకి గురైన కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)