हैदराबाद : नामपल्ली रेवले स्टेशन में चारमीनार एक्सप्रेस ट्रेन (12760) पटरी से उतर गई। ट्रेन तेज गति से आई और प्लेटफार्म की साइड की दीवार से टकरा गई। इस घटना में तीन डिब्बे पटरी से उतर गए। इस हादसे में पांच लोग घायल हो गये। चेन्नई से चारमीनार एक्सप्रेस ट्रेन आज सुबह नामपल्ली पहुंची।
प्लेटफार्म पर आते समय ट्रेन पटरी से उतर गई और साइड की दीवार से टकरा गई। दुर्घटना के दौरान साइड की दीवार के पास मौजूद पांच यात्रियों को चोटें आईं। रेलवे अधिकारियों ने उन्हें नजदीकी अस्पताल में भर्ती कराया। डॉक्टरों ने बताया कि घायलों की जान को कोई खतरा नहीं है और केवल मामूली चोटें आई हैं। हादसे की जांच की जा रही है।
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్
హైదరాబాద్: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు (12760) పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైనట్టు తెలుస్తుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు చెన్నై నుంచి ఈ ఉదయం నాంపల్లికి చేరుకుంది.
ప్లాట్ ఫాంపైకి వస్తున్న సమయంలో పట్టాలు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది రైలు. ప్రమాదం సమయంలో సైడ్ వాల్ దగ్గర ఉన్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు. గాయపడిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్…
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ సైడ్ వాల్ ని తాకి బోగిలు పట్టాలు తప్పడం పై విచారణ వ్యక్తం చేసిన రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పట్టలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.
హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాల పై అధికారులతో ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వెంటనే జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. (ఏజెన్సీలు)