हैदराबाद: तेलंगाना जन समिति पार्टी का कांग्रेस में विलय होने को लेकर चल रहे बड़े पैमाने पर चल रहे प्रचार/अफवाहों प्रोफेसर कोदंडाराम ने प्रतिक्रिया दी है। नामपल्ली (हैदराबाद) टीजेएस पार्टी कार्यालय में कोदंडाराम ने स्पष्ट किया कि तेलंगाना जन समिति का किसी भी पार्टी में विलय नहीं किया जाएगा।
कोदंडाराम ने कहा कि बीआरएस सरकार के भ्रष्टाचार और अनियमितताओं के खिलाफ उनकी पार्टी की लड़ाई लगातार जारी रहेगी। उन्होंने कहा कि वे केसीआर सरकार के खिलाफ आंदोलन कर रही लोकतांत्रिक ताकतों को एकजुट करेंगे और संघर्ष करेंगे। कोदंडाराम ने घोषणा की कि इसी के अंतर्गत इस महीने की 21 तारीख को टीजेएस तेलंगाना बचाओ यात्रा करेंगे।
కాంగ్రెస్‌లో తెలంగాణ జనసమితి విలీనంపై క్లారిటీ ఇచ్చిన ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున జరుగుతోన్న ప్రచారంపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కోదండరాం తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తమ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కార్‌పై ఉద్యమిస్తోన్న, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 21న తెలంగాణ బచావో యాత్ర చేయనున్నట్టు కోదండరాం ప్రకటించారు.
అక్కంపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర కొనసాగుతుందని కోదండరాం చెప్పుకొచ్చారు. తెలంగాణ బచావో పేరుతో సదస్సులు నిర్వహించి ప్రజలకు ధరిణి కష్టాలు వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాలలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు.
రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ కార్పోరేట్ చేశేశారని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాయించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనొక్కరే కాకుండా బీఆర్ఎస్ ఇతర నేతలు కూడా భూ, ఇసుక దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. (ఏజెన్సీలు)