రైతుబంధుకు ఐదేళ్లు, వర్ధిల్లాలి వెయ్యేళ్లు

రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతును గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు

ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ

ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 144.35 లక్షల ఎకరాలకు 7217.54 కోట్ల సాయం

ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ (FAO) 2018 – 19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాలలో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం దీనికి నిదర్శనం

ఏటా రూ.10,500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు

రూ.32,700 కోట్లతో విద్యుత్ మౌళిక సదుపాయాల కల్పన

ఇప్పటి వరకు రూ.17,351.17 కోట్ల రుణమాఫీ

రైతుభీమా పథకం కింద ఇప్పటి వరకు 99,297 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4964.85 కోట్ల భీమా పరిహారం

రూ.5349 కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్దరణ

రూ.572 కోట్లతో 2601 రైతువేదికల నిర్మాణం

లక్ష 21 వేల కోట్లతో 671.22 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ

రూ.10,719 కోట్లతో ఇతర పంటల సేకరణ

రూ.1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం

దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్దఎత్తున చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఈ పథకాల మూలంగా సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి

ఒకప్పుడు ధీనంగా ఉన్న రైతన్న నేడు ఎవ్వరికీ బెదరకుండా గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నాడు

కష్టం చేసుకునే రైతు ఎంత కరంటు వాడినా, ఎంత భూమి సాగుచేసిన అడిగేవారు లేరు

తెలంగాణ వ్యవసాయ పథకాల మూలంగా వచ్చిన మార్పేంటి ? సమాజానికి జరిగిన మేలేంటి ? అని మహారాష్ట్ర నుండి వచ్చిన బృందం అధ్యయనం చేస్తున్నది

తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా ఇక్కడి సమాజంలో శాంతి నెలకొన్నది

ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న గొప్పగా బతికినప్పుడే సమాజం బాగుంటుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష

వ్యవసాయరంగం పట్ల కేంద్రం తిరోగమన విధానంలో ముందుకుసాగుతుంటే తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పురోగమన విధానంలో ముందుకుపోతున్నది

అత్యధిక శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన

అందుకే అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీఅర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ముందుకుపోతున్నది

కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, జాతీయ నినాదం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, మేధావులను, బుద్దిజీవులను ఆలోచింపచేస్తున్నది

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఅర్ఎస్ జెండా ఎగురుతుంది

నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్న చరిత్ర బీజేపీది

రాబోయే ఎన్నికల్లో ప్రజాగ్రహంలో దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ఖాయం

మోడీ అనాలోచిత విధానాలు దేశాన్ని సంక్షోభం వైపు నెడుతున్నది

రైతులను, రైతుకు అండగా నిలిచే కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు

కొన్ని నిర్ణయాలు సమాజంలో మార్పుకు ఎలా నాంది పలుకుతాయో తెలంగాణ ప్రభుత్వ పథకాలు దానికి నిదర్శనం

2018 మే 10న కరీంనగర్ జిల్లా శాలపల్లి బహిరంగసభలో ధర్మరాజుపల్లి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చి రైతుబంధు ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

రైతుబంధు పథకం ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్తయిన సంధర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రైతులతో కేక్ కట్ చేసి రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

మంత్రి హరీశ్ రావు ట్వీట్

రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.!

సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది.

అందుకే సీఎం కేసీఆర్ గారు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ అంటూ బి ఆర్ ఎస్ ను స్వాగతిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X