“దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం”

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించింది. సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సీఎం కెసిఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుంది.

9 మంది లోక్సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం. సీఎం కేసీఆర్ గారి దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC K Kavitha statement

A party that began with the single goal of “Telangana state formation” achieved success despite difficult political conditions and with the overwhelming support of every citizen who believed in the idea of Telangana.

A man with a mission whose commitment inspired 39 political parties across the country to support the Telangana statehood.

It is KCR’s statesmanship and perseverance for the formation & development of Telangana that Today, BRS is with 9 MP’s in Lok Sabha, 7 MP’s in Rajya Sabha, and 105 MLAs in Telangana, the party has grown into a national powerhouse.

The opening of our party’s Delhi office is a proud moment for every pink soldier.

This is the amazing journey that our visionary leader, KCR Garu, and everyone else who believed in him, his vision and the commitment of BRS Party have taken.

బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ప్రారంభించిన పార్టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో నూత‌నంగా నిర్మించిన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభించారు. భ‌వ‌నం ప్రారంభోత్సవానికి ముందు అక్క‌డ నిర్వ‌హించిన సుద‌ర్శ‌న పూజ‌, హోమం, వాస్తు పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ త‌ర్వాత భ‌వ‌న్ శిలాఫ‌లకాన్ని ఆవిష్క‌రించారు కేసీఆర్. అనంత‌రం మ‌. 1.05 గంట‌ల‌కు రిబ్బ‌న్ క‌ట్ చేసి భ‌వ‌న్‌లోకి ప్ర‌వేశించారు కేసీఆర్. భ‌వన్‌లో దుర్గామాత అమ్మ‌వారికి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

నంత‌రం భ‌వ‌నంలోని మొద‌టి అంతస్తులో ఏర్పాటు చేసిన త‌న ఛాంబ‌ర్‌కు కేసీఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రికాసేప‌ట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశ‌వ‌రావు, వెంక‌టేశ్ నేత‌, సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది.

ఢిల్లీ వసంత్‌ విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X