డాక్టర్ B. R. అంబేద్కర్ స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించింది
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర, బి.సి. కమీషన్ మాజీ చైర్మన్, శ్రీ బి.ఎస్.రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన అంబేద్కర్ చిత్రపటానికి పుష్ప నివాళి అర్పించి “డా. బి.ఆర్. అంబేద్కర్ మరియు ఒబీసి కమ్యూనిటీలు” అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.
అయన మాట్లాడతూ డా. అంబేద్కర్ ఓబీసీలకు విద్యను అందుబాటులో ఉంచాలని అనేక సందర్బాలలో ప్రస్తావించారన్నారు. ఇప్పుడిప్పుడే ఓబీసీలు క్రమంగా అబివృద్ధి చెందుతూ మేల్కొంటున్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా వారేనని, వారిపైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న విషయం మరువకూడదన్నారు. నాటి రాజ్యాంగ సభలో ఓబీసీ సభ్యులు లేరని, బ్రాహ్మణులు మరియు బనియాల ప్రాభల్యం ఎక్కువ ఉండేదని పేర్కొన్నారు.
రాజ్యాంగ సభలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓబీసీల పోరాటంలో ఒంటరిగా పోరాడారు ఆయన పోరాటానికి మద్దతు దొరక్కపోవడంతో 26 జనవరి 1950న ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ఓబీసీ నాయకులను ప్రోత్సహించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా అంబేద్కర్ కోరుకున్న సమానత్వం పూర్తిగా రాలేదన్నారు. సమానత్వం, వివక్షత లేని ఆర్ధిక సమానత్వ సమాజాన్ని అంబేద్కర్ కోరుకున్నారన్నారు, దాని కోసం ఓబీసీ లలోని మేధావి వర్గం ప్రయత్నం చేయాలన్నారు. దేశ జనాభాకు అనుగుణంగా ఎంపీ ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే బీసీలకు చట్టసభల్లో సరైన ప్రాధాన్యత లభిస్తింది అని వివరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య.కె. సీతారామారావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తైన డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఏప్రిల్ 14న ప్రారంభించడం అంటే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లుగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యం అయ్యిందని ఆయన గుర్తు చేశారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉందన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. అంబేద్కర్ ఆశయాలను ముదుకు తీసుకెళ్ళడంలో విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు. తెలుగు విభాగ అధిపతి డా.రజని ముఖ్య అతిధిని పరిచయం చేశారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎ.వి.ఎన్.రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. బానోత్ లాల్; ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; విద్యార్ధి సేవల విభాగ డైరెక్టర్ డా. ఎల్వికే రెడ్డి; డీన్ ప్రొ.పుష్పా చక్రపాణి, పుస్తక ప్రచురణల విభాగ డైరెక్టర్ డా.గుంటి రవీందర్; పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, ఎస్సీ ఎస్టీ సెల్ ఇంచార్జ్ డా. ప్రమీల కేతావత్, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మహేశ్వర్ గౌడ్, శర్మ, కిషోర్, కృష్ణ కుమారి, రాజా బాబు, గోపాల కృష్ణ , కామేశ్వరి, బుద్ధ తదితరులు హాజరైయారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గత వారం రోజులుగా ఉద్యోగులకు నిర్వహించిన క్రీదాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందించారు.
OBCs ARE THE FUTURE OF THE COUNTRY : B. S. Ramulu
Hyderabad : Dr BR Ambedkar Open Uninversity (BRAOU) organized Dr. B. R. Ambedkar Memorial Lecture at its campus as part of 132nd Birthday Celebrations of Bharat Ratna Dr. B. R. Ambedkar on April 14,2023.
The Chief Guest Sri B.S.Ramulu, Former Chairman, Telangana State B.C. Commission delivered a lecture on “Dr.B.R.Ambedkar and OBC Communities” He said that Dr. B.R.Ambedkar mentioned on several occasions that education should be made available to OBCs. It is only now that OBCs are waking up with gradual development. They should not forget that they are more than 50 percent of the country’s population and the future of this country depends on them. It is stated that there were no OBC members in the then Constituent Assembly and Brahmins were more dominant. For their own interests, they betrayed their communities.
In the Constituent Assembly, Babasaheb Ambedkar fought alone in the struggle of the OBCs and when his struggle did not find support, he encouraged the OBC leaders to form the All India Backward Classes Federation on 26 January 1950. He said that even after seven decades of independence, Ambedkar’s desired equality has not been achieved. Ambedkar said that he wanted a society of equality and economic equality without discrimination, and the intelligentsia of the OBCs wanted to make an effort for that. He said that the responsibility to sensitize the BCs is on them.
Prof. K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the function. Prof. Rao said that on the occasion of Ambedkar’s birth anniversary Dr. B.R. Ambedkar. Telangana Government constructed a 125 feet tall statue of Dr. B.R. Ambedkar and inaugurated it on April 14 as a true tribute to him. He reminded that the emergence of a separate state of Telangana was made possible only through Article 3 incorporated in the Constitution. Also, it is appropriate to name the newly constructed state secretariat after Dr BR Ambedkar.
Prof. Ghanta Chakrapani, Director (Academic) attended as guest of honor in the program, explained the need for the program and the details of those who have delivered Ambedkar memorial lectures so far. Dr. Rajani, Head of Telugu Department and introduced program and chief guest. She also said that the university is working hard to carry forward the aspirations of Ambedkar. Dr.A.V.R.N.Reddy, Registrar also spoke on the occasion. The program was attended by Dr.Banoth Lal, EC Member; Prof.Vaddanam Srinivas, Director EMR&RC; Prof.I.Anand Pawar, Director CSTD; Prof.Pushpa Chakrapani, Dean Sciences; Dr.L.V.K.Reddy, Director LSSD, Dr. Pramila Kethawath, Incharge, SC/ST Cell all Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations garlanded the Portrait of Dr. B. R. Ambedkar and offered rich floral tributes.The Prizes distributed to the winners in games and sports competitions conducted on the occasion.