हैदराबाद/नई दिल्ली : लंबी पूछताछ के बाद एमएलसी के कविता ईडी कार्यालय से बाहर आ गई। लगभग 10 घंटे तक ईडी अधिकारियों ने कविता से पूछताछ की। खबर है कि मंगलवार को कविता से ईडी कार्यालय में जांच की जाएगी।
इससे पहले ईडी कार्यालय में जांच के सामने उपस्थित एमएलसी के कविता के पास उनके वकील पहुंच गये हैं। दिल्ली में मौजूद महाधिवक्ता रामचंद्र राव, वरिष्ठ अधिवक्ता सोमा भरत और गंड्रा मोहन राव शाम पांच बजे ईडी कार्यालय पहुंचे हैं।
20 मार्च को सुबह 10:30 बजे कविता ईडी ऑफिस गईं। तभी से वह जांच का सामना कर रही हैं। लगभग 8 बजे घंटे से कविता के साथ पूछताछ की जा रही है। कविता को रामचंद्र पिल्लै के साथ पूछताछ किये जाने की खबर है। ईडी कार्यालय को डॉक्टर भी पहुंचे हैं। डॉक्टरों में एक महिला भी शामिल है। इसके चलते ईडी कार्यालय के पास तनाव का माहौल है।
शाम को वरिष्ठ अधिवक्ताओं को ईडी कार्यालय पहुंचना दिलचस्प हो गया। सवाल उठ रहे हैं कि ये वकील आकस्मिक ईडी कार्यालय क्यों आये हैं। शराब घोटाला मामले की जांच को लेकर वे पहले ही अपने वकील पत्र लिख चुके हैं। अब सवाल यह है कि अगर जांच चल रही है तो वे कार्यालय क्यों आये और क्या हुआ होगा। ईडी दफ्तर के सामने भारी पुलिस तैनात कर दी गई है। बीआरएस कार्यकर्ताओं को पुलिस तितर-बितर कर रही हैं।
एमएलसी के कविता जांच के लिए ईडी कार्यालय पहुंच गई। कविता के साथ मंत्री भी ईडी कार्यालय गये हैं। कविता के करीबी रामचंद्र पिल्लै के साथ पूछताछ किये जाने की संभावना है। कविता के साथ यह ईडी की दूसरी पूछताछ है।
इससे पहले दिल्ली शराब घोटाले में आरोपों का सामना कर रही एमएलसी कल्वकुंट्ला कविता रविवार शाम विशेष विमान से दिल्ली पहुंच गईं। कविता अपने पति अनिल कुमार, मंत्री केटीआर, सांसद संतोष कुमार, कानूनी टीम और प्रमुख अनुयायियों के साथ बेगमपेट हवाई अड्डे से एक विशेष विमान से दिल्ली आईं। वे दिल्ली एयरपोर्ट से सीधे तुगलक रोड स्थित सीएम केसीआर के आवास पहुंच गए। लेकिन क्या कविता सोमवार को ईडी की पूछताछ में शामिल होंगी? क्या फिर गैरहाजिर रहेगी? इसे लेकर सर्वत्र दुविधा जारी है।
ईडी की जांच को लेकर रविवार रात मंत्री केटीआर, एमएलसी कविता और लीगल टीम की भी मीटिंग हुई। सोमवार की सुनवाई में शामिल होना चाहिए या नहींं? यदि उपस्थित नहीं होते हैं तो किस प्रकार की कानूनी समस्याएँ उत्पन्न होंगी? जैसे विषयों पर चर्चा की। इसी क्रम में फोन पर सुप्रीम कोर्ट के वरिष्ठ अधिवक्ता से सलाह ली गई। पता चला है कि उनकी सलाह पर कविता दिल्ली पहुंच गई।
सोमवार को परिस्थितियों के हिसाब से ईडी कार्यालय जाने या नहीं, इस पर फैसला लिया जाएगा। इसी महीने की 16 तारीख को कविता को दूसरी बार ईडी के सामने पेश होना था। मगर बीआरएस नेता और अधिवक्ता सोमा भरतकुमार को अपना प्रतिनिधि बनाकर ईडी कार्यालय भेजा। साथ ही सुप्रीम कोर्ट में एक याचिका दायर की गई थी कि ईडी की जांच नियमानुसार आगे नहीं बढ़ रही है।
ఈడీ ఆఫీసుకు కవిత లాయర్లు, విచారణ సమయంలో వాళ్లెందుకొచ్చారు
ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కవిత ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. అప్పటి నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈడీ ఆఫీసుకు సాయంత్రం సమయంలో సీనియర్ అడ్వకేట్లు చేరుకోవటం ఆసక్తిగా మారింది. అంత హడావిడిగా వారు రావటం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. లిక్కర్ స్కాం కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే తన లాయర్ల కవిత లేఖ కూడా రాశారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో వీరు ఆఫీసులోకి వెళ్లటం ద్వారా ఏమై ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఈడీ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కార్యకర్తలను చెదరగొడతున్నారు.
Delhi Liquor Scam : ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హాజరైన కవిత
హైదరాబాద్/న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఆమె వెంట భర్తతోపాటు.. ఇతర బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత పిడికిలి బిగించి పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపిస్తూ ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత లాయర్ ను కూడా అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. కవితకు ధైర్యం చెబుతూ ఈడీ కార్యాలయం లోపలికి సాగనంపారు.
ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. వెళ్తారా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ.. విచారణకు హాజరయ్యారు కవిత.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతారని ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. మార్చి 20న ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందు హాజరవుతారని చెప్పారు. ఈడీ విచారణకు భయపడి కాదని.. చట్టంపై గౌరవంతో కవిత వెళ్తున్నారాని తెలిపారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై న్యాయవాదులతో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరిపారు. సుధీర్ఘ చర్చల తర్వాత ఈడీ విచారణకు హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 20న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరవనున్నారు.
దీనికంటే ముందు ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అనిల్‌కుమార్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, లీగల్ టీం, ముఖ్య అనుచరులతో కలిసి కవిత బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తుగ్లక్‌రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్నివాసానికి వారు వెళ్లారు. అయితే కవిత సోమవారం ఈడీ విచారణకు అటెండ్అవుతారా ? మళ్లీ స్కిప్ చేస్తారా ? అనే దానిపై డైలమా కొనసాగుతోంద
ఈడీ విచారణపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లీగల్ టీంతో ఆదివారం రాత్రి కూడా సమావేశమయ్యారు. సోమవారం నాటి విచారణకు హాజరు కావాలా ? వద్దా ? అటెండ్ కాకుంటే లీగల్‌గా ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే దానిపై చర్చించారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్‌తో దీనిపై ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సోమవారం పరిస్థితులకు అనుగుణంగా విచారణకు వెళ్లాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈనెల 16న కవిత రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజున ఢిల్లీలోనే ఉన్నా వెళ్లలేదు. తన ప్రతినిధిగా బీఆర్ఎస్ నేత, అడ్వకేట్ సోమ భరత్‌కుమార్‌ను ఈడీ ఆఫీస్‌కు ఆమె పంపారు. నిబంధనల మేరకు ఈడీ విచారణ సాగడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే దానిపై అర్జంట్‌గా విచారించలేమని, ఈనెల 24న విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తన పిటిషన్‌పై నిర్ణయం ప్రకటించే వరకు విచారణకు రాలేనని అడ్వకేట్ ద్వారా ఈడీకి కవిత చెప్పారు. కవిత విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈడీ ఈనెల 20న (సోమవారం) విచారణకు హాజరుకావాలంటూ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈడీ కేవియట్వేయడం, ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు కవితకు సూచించారు.
ఆ సూచనతోనే కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.కాగా, మహిళ అయిన తనను ఇంటి దగ్గర విచారించేలా ఈడీ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14 న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై స్టేకు నిరాకరించిన సీజేఐ, విచారణను ఈ నెల 24 కు వాయిదా వేశారు. కవిత పిటిషన్లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ ఈడీ సుప్రీం కోర్టులో కేవియట్దాఖలు చేసింది.
ఆ ముగ్గురి కన్‌ఫ్రంటేషన్ విచారణ..
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు. లిక్కర్‌స్కాంలో తాను కవిత బినామీని అని విచారణలో ఒప్పుకున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఆ స్టేట్మెంట్విత్ డ్రా చేసుకోవడానికి రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌వేశారు. కవిత పేరు ప్రస్తావించకుండానే ఈడీ ఆమె సెంట్రిక్‌గానే దానిపై కౌంటర్పిటిషన్దాఖలు చేసింది. కవితతో పాటు అరుణ్‌రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్బుచ్చిబాబును ఈడీ కన్‌ఫ్రంటేషన్ (ముఖాముఖి) విచారణ చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పిళ్లై ఈడీ కస్టడీని కోర్టు పొడగిస్తూ వస్తోంది. (ఏజెన్సీలు)