रेवंत रेड्डी पर अंडे और टमाटर से हमला, पदयात्रा के दौरान हाई टेंशन

हैदराबाद: पदयात्रा के तहत भूपालपल्ली में रेवंत रेड्डी द्वारा आयोजित नुक्कड़ सभा में तनाव उप्पन्न हो गया। रेवंत रेड्डी के भाषण के दौरान बीआरएस कार्यकर्ताओं ने हमला किया। रेवंत रेड्डी पर अंडे और टमाटर फेंकने की कोशिश की गई। इस घटना में रेवंत रेड्डी को चोट नहीं आई। सभा में कुछ लोगों टमाटर और अंडे लगने से कांग्रेस कार्यकर्ता भी गंभीर हो गए।

इसी क्रम में कांग्रेस कार्यकर्ताओं ने भी बीआरएस कार्यकर्ताओं पर जमकर पथराव व बोतलें फेंकी, जिससे तनाव का माहौल बन गया। तनावपूर्ण स्थिति के बीच रेवंत रेड्डी की कॉर्नर मीटिंग को संबोधित किया। बीआरएस कार्यकर्ताओं के हमले पर रेवंत ने कड़ी प्रतिक्रिया व्यक्त की। उन्होंने रोष व्यक्त करते हुए कहा कि यह विधायक गंड्रा के कार्यकर्ताओं का काम है। उन्होंने चुनौती दी कि अंडे और टमाटर को फेंकना नहीं चाहिए, बल्कि सीधे आना चाहिए। उन्होंने चेतावनी दी कि अगर मैं चाहुंगा तो कोई भी घर भी नहीं जा पाएगा।

రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టామాటాలతో దాడి, పాదయాత్రలో హైటెన్షన్

హైదరాబాద్ : పాదయాత్రలో భాగంగా భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనలో రేవంత్ రెడ్డికి అవి తగలలేదు. సభలోని కొంతమందికి తగలండంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, సీసాలు రువ్వడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై రేవంత్ ఘాటుగా స్పందించారు. ఇది ఎమ్మెల్యే గండ్ర అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు, టామాటాలు వేయించడం కాదని, దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసిరారు. తాను తలుచుకుంటే నీ ఇల్లు కూడా ఉండదంటూ హెచ్చరించారు.

మీటింగ్‌లోకి చొచ్చుకెళ్లుందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. రేవంత్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను పోలీసులు నిలువరించారు. రాళ్ల దాడిలో కాటారం ఎస్ఐ శ్రీనివాస్ గాయాలవ్వగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Related News:

బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని రేవంత్ ఖండించారు. ‘కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించినవారికి బుద్ధి చెప్తాం. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను తలుచుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది.

రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదని మేం ఆ రోజు యాత్రకు విరామం ఇచ్చాం. ఇవాళ ఆవారా గాళ్లు దాడులు చేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? ఎస్పీ ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు సాయం అందిస్తాం. భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’ అని రేవంత్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X