తెలంగాణలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ అన్నారు.

గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు వత్తిడి చేస్తున్నారు. చేసిన పనులకు నిధులు విడుదల చేయడం లేదు. బిల్స్ చాలా పెండింగ్ లో ఉండి, సర్పంచులు, ఉప సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ సర్పంచులు, ఏక గ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లు చాలా.మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాలలో పనులు చేయకపోతే అధికారులు సస్పెండ్ చేస్తామని సర్పంచులను బెదిరిస్తున్నారు.. చేసిన పనులకు బిల్స్ ఇవ్వడం లేదు. వచ్చిన కొద్దిపాటి నిధులను ట్రాక్టర్ ఈ.ఎం.ఐ లకు కట్ చేస్తున్నారు. ఇలా సర్పంచుల పరిస్థితి గందరగోళంగా మారింది.

ఈ పరిస్థితులలో గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ల హక్కుల సాధన కోసం టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జనవరి 2వ తేదీన ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ప్రజలు, గ్రామాల సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఒక చట్టప్రకారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామని టీపీసీసీ తరపున మేము విజ్ఞప్తి చేస్తే పోలీసులు, ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సర్పంచుల సమస్యలు పరిష్కరించరు.. అడిగితే మమ్మల్ని నిర్భధాలు చేస్తూ హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం తెలంగాణ ను నిర్బందాల ప్రయోగ శాలగా మార్చేసి అక్రమ అరెస్టులు, గృహ నిర్బందాలు చేస్తుంది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. సర్పంచులకు వెంటనే నిధులను విడుదల చేయాలి.. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, టీపీసీసీ మాజీ.అధ్యక్షులు

సర్పంచుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధి కి తోడ్పడాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడం దుర్మార్గం. వెంటనే గ్రామాలకు నిధులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం అక్రమం.. అరెస్ట్ చేసిన నాయకులందరిని వెంటనే విడుదల చేయాలి.

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసింది. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు వత్తిడి చేస్తున్నారు. చేసిన పనులకు నిధులు విడుదల చేయడం లేదు. బిల్స్ చాలా పెండింగ్.లో ఉండి, సర్పంచులు, ఉప సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ సర్పంచులు, ఏక గ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లు చాలా.మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాలలో పనులు చేయకపోతే అధికారులు సస్పెండ్ చేస్తామని సర్పంచులను బెదిరిస్తున్నారు.. చేసిన పనులకు బిల్స్ ఇవ్వడం లేదు. వచ్చిన కొద్దిపాటి నిధులను ట్రాక్టర్ ఈ.ఎం. ఐ లకు కట్ చేస్తున్నారు. ఇలా సర్పంచుల పరిస్థితి గందరగోళంగా మారింది.

ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. సర్పంచులకు వెంటనే నిధులను విడుదల చేయాలి.. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X