हैदराबाद: टॉलीवुड फिल्मी इंडस्ट्री में एक और अभिनेता का निधन हो गया है। वरिष्ठ अभिनेता चलपति राव (78) का निधन हो गया। अभिनेता ने आज तड़के हैदराबाद स्थित अपने आवास पर दिल का दौरा पड़ने से अंतिम सांस ली। वरिष्ठ अभिनेता कैकाल सत्यनारायण का दो दिन पहले निधन हो गया था। आज चलपति राव की अचानक निधन हो जाने से टॉलीवुड फिल्मी उद्योग में शोक की लहर छा गई है। चलपति राव पिछले कुछ समय से बीमारी से पीड़ित थे। इसके चलते वह एक्टिंग से दूर थे। चलपति के निधन की खबर मिलते ही अभिनेता चलपति राव के घर पहुंच रहे हैं। चलपति राव को श्रद्धांजलि दे रहे हैं। चलपति राव ने 1,200 से अधिक फिल्मों में काम किया। चलपति राव की पहचान एक अभिनेता और निर्माता के रूप में है। चलपति राव ने निर्माता के रूप में 7 फिल्मों का निर्माण किया।
वरिष्ठ अभिनेता एनटीआर के प्रोत्साहन से चलपति राव ने फिल्म उद्योग में प्रवेश किया और तीन पीढ़ियों के नायकों के साथ काम किया। 1966 में उन्होंने फिल्म ‘गुडाचारी 116’ से फिल्म इंडस्ट्री में कदम रखा। चलपति राव ने संपूर्ण रामायणम, यमागोला, ड्राइवर रामुडु, बोब्बिली पुली, प्रेमकानुका, बोब्बिली ब्राह्मण, कैदी जैसी हिट फिल्मों में काम किया। कलियुग कृष्णडु, कडपारेडम्मा, जगन्नाटकम, अर्धरात्रि हत्यलु, रक्तम चिंदिन रात्रि फिल्मों का निर्माण किया।
चलपति राव के बेटे रवि बाबू ने बताया कि उनके पिता का निधन आधी रात को दिल का दौरा पड़ने से हुआ। रवि बाबू पिछले कुछ समय से एमएलए कॉलोनी में रह रहे हैं। उनकी बेटी के अमेरिका से आने के बाद अंतिम संस्कार किया जाएगा। अंतिम संस्कार बुधवार (इस महीने की 28 तारीख) को महाप्रस्थान में होगा। चलपतिराव पार्थिव शरीर आज दोपहर 3 बजे के बाद प्रशंसकों के दर्शन के लिए फिल्म नगर महाप्रस्थानम के फ्रीजर में रखा जाएगा। चलपति राव का जन्म 8 मई 1944 को कृष्णा जिले के बल्लीपर्रू गांव में मणिय और विय्यम्मा दंपत्ति को हुआ था। चलपति राव को एक बेटाा रवि बाबू और दो बेटियां मालिनीदेवी और श्रीदेवी हैं।
ప్రముఖ టాలీవుడ్ నటుడు చలపతిరావు కన్నుమూత
హైదరాబాద్ : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు(78) ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1,200 పైగా సినిమాలలో చలపతిరావు నటించారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. నిర్మాతగా 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు.
సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చలపతిరావు సినీరంగ ప్రవేశం చేసిన ఆయన మూడు తరాల హీరోలతో చలపతిరావు పని చేశారు. 1966లో ‘గూడచారి 116’ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు. సంపూర్ణ రామాయణం, యమగోల, డ్రైవర్ రాముడు, బొబ్బిలి పులి, ప్రేమకానుక, బొబ్బిలి బ్రహ్మన్న, ఖైదీ వంటి హిట్ చిత్రాల్లో చలపతి రావు నటించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, అర్థరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి.. చిత్రాలి నిర్మించారు.
రెండు రోజుల క్రితమే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ మృతిచెందగా… ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలం నుంచి అనారోగ్యంతో చలపతిరావు బాధపడుతున్నారు. దీంతో నటనకు దూరంగా ఉంటున్నారు. విషయం తెలియగానే సినీ నటులు చలపతిరావు ఇంటికి చేరుకుంటున్నారు. చలపతిరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.
అర్థరాత్రి గుండెపోటుతో తమ తండ్రి చనిపోయారని చలపతిరావు కుమారుడు రవిబాబు తెలిపారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీలో కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం (ఈనెల28న) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శన కోసం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత చలపతిరావు పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచనున్నారు.
1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో మణియ్, వియ్యమ్మ దంపతులకు చలపతిరావు జన్మించారు. చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.
దాదాపు 600కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. చలపతిరావు కుమార్తెలు యూఎస్ లో ఉన్నారని తెలుస్తోంది. వారు వచ్చిన తర్వాతే చలపతిరావు అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. 1966లో ‘గూడచారి 116’ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.
సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీమ్ అనార్కలి, భలే కృష్ణుడు, సరదా రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్.. ఇలా ఎన్నో వందల చిత్రాల్లో చలపతిరావు కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు. (Agencies)