దేవరుప్పల పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
పనులు త్వరగా పూర్తిచేసి, కొత్త పనులకు ప్రతిపాదనలు పంపించాలి – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Hyderabad : పాలకుర్తి నియోజకవర్గాని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని, నియోజకవర్గ ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల గ్రామాల అభివృద్ధిపై సమీక్ష చేశారు. అనంతరం దేవరుప్పుల మండలంలో పలు కార్యక్రమాలకు హాజరై పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థానికులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
పాలకుర్తి మండలంలోని ఎనిమిది గ్రామాలు తిరుమలగిరి, మల్లంపల్లి, కొండాపూర్, మంచుప్పల, చెన్నూరు, వల్మిడి ,ఇసునూరు విష్ణుపురి కాలనీల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేసి, అక్కడ జరుగుతున్న పనులు, జరగాల్సిన పనులపై చర్చించారు. కొనసాగుతున్న కార్యక్రమాలని వెంటనే పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం చేయాలన్నారు. కొత్త పనులకు ప్రతిపాదనలు రూపొందించి ఇవ్వాలన్నారు. ఆయా గ్రామాల్లోని 25 మంది లబ్ధిదారులకు 10 లక్షల 4వేల రూపాయల విలువైన చెక్కులను అందించారు.
అనంతరం దేవరుప్పల మండలం, కామారెడ్డి గూడెం అక్షర గార్డెన్లో చింత పుష్ప – చంద్రయ్య దంపతుల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులు సృజన్ – ప్రియలను ఆశీర్వదించి, స్థానిక లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి, పార్టీ మండల కార్యాలయ నిర్మాణానికి స్థానికులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే అన్ని వసతులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటామని తెలిపారు. మండల పార్టీ నాయకులు, గ్రామాల నాయకులతో సమన్వయం చేసుకొని, అభివృద్ధి, సంక్షేమ పనులు సజావుగా, సత్వరంగా జరిగేటట్లు నిరంతరం పనిచేయాలన్నారు.