జర్నలిస్ట్ ప్రపంచం దాదాపు పురుషులదే! ఇక్కడ అడుగడుగునా సవాల్లే. కొన్ని మాటలు తట్టుకోవాలి, కొన్ని చూపులు తట్టుకోవాలి, ఎన్నో రాజకీయాలను ఎదుర్కోవాలి. వార్తలో, విశ్లేషణలో చేస్తున్నపుడు బయటి నుంచి వచ్చే సవాళ్లు ఒక ఎత్తైతే, in-house రాజకీయాలు ఇంకో ఎత్తు.
కదిలిస్తే ఒక్కో woman journalist ఒక్కో కథ చెప్తారు. వృత్తిలో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి. Male boss తో ఉండే కష్టాలు మామూలే. అతనికి మనం “నచ్చితే” అదోరకంగా ఇబ్బంది. మన పని “నచ్చకపోతే” అదోరకంగా ఇబ్బంది. ఇవి షరా మామూలే!
ఇక లేడీ బాసులు తక్కువ. ఒక వేళ ఉన్నప్పటికీ రమా సరస్వతి గారు చెప్పినట్టు ఎంసీపీ లేకుండా ఉండటం దాదాపు అసాధ్యం. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన వికారం. పైన boss female ఏ ఉన్నా కూడా ఆమెకు మనలో నచ్చనిది లేదా నచ్చి ఈర్ష్య కలిగే లక్షణాలు ఏవైనా ఉంటే ఇక నీ కెరీర్ సంకనాకినట్టే! ఆమె మనసులో వికారానికి నీ స్టోరీ సచ్చిపొద్ది. అలా రెండు మూడు సార్లు జరిగాక మన అల్టిమేట్ boss కి మనకు పని రాదన్న రిపోర్ట్ వెళ్తుంది. ఇంకేముంది గోవిందా!
ఇంకో రకం మిత్రుల వంటి శత్రువులు ఉంటారు. వీళ్ళు మనకంటే సీనియర్లు, మిత్రుల లాగే ఉంటారు. ఏదో సలహా ఇస్తున్నట్టే ఉంటుంది కానీ అవి సలహాలు కావు. పక్కనే ఉండి మన కాన్ఫిడెన్స్ దెబ్బ తీస్తారు. ఇంకొంత మంది ఉంటారు. సీనియర్లు మనలను జ్జునియర్లా చూడకుండా మహా గొప్ప దయతో ఉన్నట్టే ఉంటూ స్నేహం ముసుగులో మనకు ఎదిగే అవకాశం లేకుండా చేస్తారు. వీళ్ళను మర్రి చెట్లు అనొచ్చు. నీడన హాయిగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఎన్నాల్లున్నా ఎదుగు బొదుగు ఉండదు. అవకాశం దొరికినప్పడల్లా నువ్వు ఎంత జూనియర్ వి అయినా చూడు నేను ఎంత broad mainded గా నీతో స్నేహం చేస్తున్నానో అని కొన్ని సార్లు పబ్లిక్ గానే ప్రకటిస్తుంటారు. అది మన ఆత్మ గౌరనికి భంగమేమో అని ఈ సోకాల్డ్ స్నేహితులకు అర్థం కూడా కాదు.
ఇక ఇంట్లో సవాళ్లు బోలెడు. ఆర్థిక కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ఉద్యోగం లో చేరిన journalist కంటే నాలుగిళ్ళలో పాచి పని చేసుకునే ఆమె ఎక్కువ సంపాదిస్తుంది అంటే అతిశయోక్తి కానే కాదు. రాత మీద మక్కువో, లేక ఈ వృత్తి పట్ల ప్యాషన్ వల్లో ఇది వదల బుద్ధి కాదు. ఒకొక్కరు ఒక్కో రకమైన ఇబ్బంది పడి ఉంటారు. కొస మెరుపు ఏమిటంటే నా లాంటి పుణ్యత్ములకు మహా బొనాంజా ఈ మొత్తం ఇబ్బందులు, కష్టాలు అన్నీ ప్యాకేజీ కింద దొరుకుతాయి.
తెలుసు ఇలాంటివన్నీ చుట్టూ ఉన్నాయని, ప్రతి హగ్ నిజం కాదని, ప్రతి నవ్వులో కనిపించినంత తెలుపు లేదని, అయినా ఈ క్రౌడ్ నాకిష్టం. ఈ తెలివైన స్త్రీల సాంగత్యం నాకు బావుంటుంది. Struggle for existence నేర్పుతుంది. శత్రువులాంటి మిత్రులలో మిత్రత్వాన్ని మాత్రమే గుర్తిస్తూ, శత్రుత్వాన్ని ప్రేమతో జయిస్తూ, వృత్తుల్లో దాగి ఉన్న మనవతకు విలువనిస్తూ సాగి పోవటం ఒక కళ. నేర్చుకుంటూ, మెరుగు పడుతూ…! ఉపసంహరం నచ్చదు. ఇలా సాగటమే థ్రిల్లింగ్ గా ఉంది.
– రచయత్రి భవానీ దేవినేని (99631 14262)