तेलंगाना की आर्थिक स्थिति पर श्वेत पत्र जारी, रोंगटे खड़े करने वाली सामने आई सच्चाई

हैदराबाद: कांग्रेस सरकार ने तेलंगाना विधानसभा में राज्य की वित्तीय स्थिति पर एक श्वेत पत्र जारी किया है। कुल 42 पन्नों के जारी श्वेत पत्र में सरकार ने कई अहम बातें उजागर की हैं। इसमें कहा गया कि तेलंगाना पर कुल कर्ज 6,71,757 करोड़ रुपये है। तेलंगाना राज्य के गठन के समय राज्य पर 72,658 करोड़ रुपये का कर्ज था। सरकार का दावा है कि दस साल में राज्य का कर्ज औसतन 24.5 फीसदी बढ़ा है। सरकार ने कहा कि 2023-24 के अनुमान के मुताबिक राज्य पर 3,89,673 करोड़ रुपये का कर्ज है।

श्वेत पत्र में कहा गया कि सरकारी निगमों पर लिया गया कर्ज 59 हजार 414 करोड़ रुपये है। राज्य बनने के बाद कर्ज का बोझ 10 गुना बढ़ गया है। सरकार का दावा है कि कर्ज चुकाने का बोझ बढ़कर राजस्व संग्रह का 34 फीसदी हो गया है। स्पष्ट किया गया है कि राजस्व आय का 35 प्रतिशत कर्मचारियों के वेतन पर खर्च किया जा रहा है। 2015-16 में जीएसडीपी पर कर्ज देश में सबसे कम 15.7 फीसदी था।

श्वेत पत्र में आगे कहा गया है कि 2023-24 तक कर्ज और जीएसटीपी बढ़कर 27.8 फीसदी हो गया है। सरकार ने साफ किया है कि बजट और वास्तविक खर्च के बीच 20 फीसदी का अंतर है। खुलासा हुआ है कि 57 साल में तेलंगाना के विकास पर 4.98 लाख करोड़ रुपये खर्च किये गये हैं। सरकार को हर दिन तरीकों और साधनों पर निर्भर रहना पड़ता है। सरकार ने श्वेत पत्र में कहा है कि 2014 में तेलंगाना सरप्लस राज्य था। वित्त मंत्री भट्टी विक्रमार्क ने कहा कि कैग रिपोर्ट के प्रमुख बिंदुओं को श्वेत पत्र में शामिल किया गया है।

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, వెలుగులోకి విస్తుపోయే నిజాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీలతో విడుదల చేసిన శ్వేత పత్రంలో పలు కీలక విషయాలను ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు అని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్రం అప్పులు రూ72,658 కోట్లు అని పేర్కొం ది. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ59వేల 414 కోట్లు అని తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని తెలిపింది. రెవెన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ రాబడిలో 35 శాతం ఉద్యోగుల జీతాలకు వ్యయం అవుతున్నట్లు స్పష్టం చేసింది. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని పేర్కొంది.

2023-24 నాటికి రుణ, జీఎస్టీపీ 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం ఉన్నట్లు సర్కారు క్లారిటీ ఇచ్చింది. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ4.98 లక్షల కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించింది. ప్రతి రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ప్రభుత్వం ఆధారపడాల్సిన దుస్థితి ఉందని స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కాగ్ నివేదికలోని కీలక అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు విడుదల చేసిన శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు ఏవంటే.. ‘‘తెలంగాణ బడ్జెట్‌కు.. వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. ‘‘ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు.. వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది. 2014- 15 లో అప్పు 72,658 కోట్లు . ప్రస్తుతం రూ.6,71,757 కోట్లకు అప్పు పెరిగింది. పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది. రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది. విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం’’ అని పేర్కొన్నారు.

ఆర్థిక శ్వేతపత్రం తప్పులతడక: హరీశ్‌ రావు

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.  గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనిపిస్తోందన్నారు.  శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందన్నారు.  తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు.  కావాలంటే వారి పేర్లు బయటపెడతానని సవాల్ చేశారు. 

అప్పు, GSDP, నిష్పత్తిని చూపకుండా అప్పు రెవెన్యూ రాబడని చూపించారని అన్నారు.   GSDPలో రుణం తక్కువగా తీసుకున్నామని వెల్లడించారు.  ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.   రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్‌రావు అన్నారు.  (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X