हैदराबाद : आंध्र प्रदेश के मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी ने राजधानी को लेकर सनसनीखेज टिप्पणी की। जल्द ही विशाखापट्टणम आंध्र प्रदेश की राजधानी बनने जा रहा है। जगन ने कमेंट किया कि मैं भी वहीं शिफ्ट हो जाऊंगा। विशाखापट्टणम से राज्य की गतिविधियां होगी।
साथ ही जगन ने कहा कि सीएम का कार्यालय भी विशाखापट्टनम में बनने जा रहा है। सीएम जगन ने ये बातें दिल्ली में आयोजित ग्लोबल समिट के दौरान कही। जगन ने 3 और 4 मार्च को विशाखापट्टनम में होने वाली ग्लोबल समिट मीटिंग में निवेशकों से बड़ी संख्या में लेने का अनुरोध किया है।
విశాఖపట్నం ఏపీ రాజధాని
హైదరాబాద్ : రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతుంది. నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖపట్నం కేంద్రంగానే రాష్ట్ర కార్యకలాపాలు జరగనున్నాయి.
అంతేకాదు సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి భారీగా పెట్టుబడిదారులు రావాలని జగన్ కోరారు.
ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం కూడా కావాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గడిచిన మూడేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
సింగిల్ డెస్క్ సిస్టం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 11.43 శాతం వృధ్దిరేటుతో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు కార్యాలకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే మూడు కారిడార్లున్నాయి. ఏపీకి సుదీర్ఘ చరిత్ర ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. (ఏజెన్సీలు)