हैदराबाद: फ्लाइट में एक यात्री को कड़वा अनुभव हुआ। जब फ्लाइट ने उड़ान भरी तो यात्री टॉयलेट रूम में चला गया और उसमें फंस गया। यह घटना स्पाइसजेट की एक फ्लाइट में हुई। स्टाफ के मुताबिक, फ्लाइट एसजी 268 मुंबई से बेंगलुरु के लिए रवाना हुई। उड़ान भरने के कुछ देर बाद यात्री टॉयलेट रूम में गया।
दरवाजा न खुलने के कारण वह बाहर नहीं आ सका। वह घबरा गया और स्टाफ को जानकारी दी। कर्मचारियों ने दरवाजा खोलने की काफी कोशिश की, लेकिन कोई फायदा नहीं हुआ। यात्री को करीब 100 मिनट तक टॉयलेट में रहना पड़ा। विमान के बेंगलुरु एयरपोर्ट पर उतरने के बाद इंजीनियरों ने आकर दरवाजा तोड़ा और यात्री को बाहर निकाला। इसके बाद सभी ने राहत की सांस ली।
విమానంలో టాయిలెట్ కు వెళ్లి చిక్కుకుపోయిన ప్రయాణికుడు
హైదరాబాద్: విమానంలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ టేకాఫ్ కాగానే టాయిలెట్ రూమ్‌కు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన స్పైస్‌జెట్ విమానంలో నిన్న చోటు చేసుకొంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. ఎస్జీ 268 విమానం ముంబై నుంచి బెంగళూరు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణికుడు టాయిలెట్ రూమ్‌కు వెళ్లాడు.
డోర్ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయాడు. భయాందోళనకు గురైన అతడు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. తలుపును తెరిచేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. అతడు దాదాపు 100 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉండాల్సి వచ్చింది. విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన అనంతరం ఇంజినీర్లు వచ్చి తలుపు పగలగొట్టి ప్రయాణికుడిని రక్షించారు. (ఏజెన్సీలు)