हैदराबाद : टी20 विश्व कप 2024 में रविवार को भारत-पाकिस्तान के बीच मेगा मुकाबला खेला जाएगा। क्रिकेट प्रेमी इस मैच का बेसब्री से इंतजार कर रहा है। इसी बीच मैच से पहले शनिवार को प्रेस कॉन्फ्रेंस में टीम के कप्तान रोहित शर्मा ने बैटिंग-ऑर्डर को लेकर बहुत ही अहम बात कही है। उन्होंने कहा कि जहां ओपनरों की जगह पक्की है, लेकिन बाकी ऑर्डर जरुरत के हिसाब से बदला जाएगा। मतलब साफ है कि पाकिस्तान के खिलाफ रोहित और विराट कोहली की पारी की शुरुआत करेंगे।
कप्तान ने ऋषभ पंत के बैटिंग ऑर्डर पर भी रोशनी डालते हुए कहा कि पंत की पलटवार शैली टीम को को फायदा पहुंचाएगी। रोहित ने सवाल के जवाब में साफ-साफ जवाब देते हुए कहा कि ओपनरों को छोड़कर किसी का भी बैटिंग ऑर्डर फिक्स नहीं है। हां, सुपर ओवर जरूरत अपवाद है। हम लचीली एप्रोच के साथ आगे बढ़ना चाहते हैं।
साथ ही रोहित ऋषभ पंत के महत्व के बारे में बोलते हुए कहा उन्होंने पंत को लेकर आईपीएल के शुरुआती दौर में ही अपना मन बना लिया था। भारतीय कप्तान ने कहा कि मैंने पंत को आईपीएल के शुरुआती मैचों मे खेलते देखा और अपना मन बना लिया। सवाल बस उनके सही बैटिंग ऑर्डर को लेकर है। निश्चित तौर पर उनकी पलटवार बैटिंग शैली हमारे लिए खासी मददगार होगी। खासकर यह देखते हुए कि हम जायसवाल को नहीं खिला सकते।
నేడు భారత్, పాక్ మ్యాచ్
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెగ్గి శుభారంభం చేసిన రోహిత్ సేన ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూపు ఏలో పాక్ మినహా భారత్‌కు పెద్ద పోటీ లేదు. సూపర్-8కు చేరుకోవడం ఖాయమే. కానీ, పాక్‌పై గెలిస్తే గ్రూపు దశను అగ్రస్థానంతో ముగించొచ్చు. కొంతకాలంగా పాకిస్తాన్ తడబాటును పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారత్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. కానీ, బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బలమైన బౌలింగ్ దళం ఉన్న పాక్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉన్నది.
పాక్‌తో మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఐర్లాండ్‌పై రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన విరాట్ నిరాశపర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరే ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, జైశ్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. 3వ స్థానంలో పంత్, ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, జడేజా బ్యాటింగ్‌కు రానున్నారు. పేస్ దళంలో బుమ్రా, పాండ్యా, సిరాజ్, అర్ష్‌దీప్ ఖాయమే. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు.
నసావు కౌంటీ పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను ఎంత వరకు కట్టడి చేస్తారనేదే దానిపైనే టీమ్ ఇండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐపీఎల్‌లో నిరాశపర్చిన పాండ్యా జాతీయ జట్టుకు వచ్చేసరికి అతను రెచ్చిపోతున్నాడు. ఐర్లాండ్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్, సిరాజ్ కూడా టచ్‌లోనే ఉన్నారు. బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని నుంచి పాక్ బ్యాటర్లకు ముప్పు తప్పదు.
కొంతకాలంగా పాక్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇటీవల అమెరికా చేతిలో ఆ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. సొంత మాజీ క్రికెటర్లే ఆ జట్టు ప్రదర్శనపై విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ బాబర్, రిజ్వాన్‌లలో మునపటి దూకుడు కనిపించడం లేదు. నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. అయినా, వాళ్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే, ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్‌లు తమదైన రోజున రెచ్చిపోయేవాళ్లే. ముఖ్యంగా భారత్‌కు పాక్ బౌలింగ్‌తో ముప్పు ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమిర్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ పిచ్‌పై బౌలర్లదే హవా అని గత మ్యాచ్‌లు చూస్తే అర్థమవుతుంది. పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. అనూహ్య బౌన్స్, స్వింగ్ బ్యాటర్లకు సవాల్ విసరనుంది. ఇక్కడ 100 పరుగులు చేయడానికే బ్యాటర్లకు కష్టాలు తప్పడం లేదు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. టీ20ల్లో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. అందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. పాక్ మూడు సార్లు నెగ్గగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మ్యాచ్‌లో టీమ్ ఇండియానే నెగ్గింది. (ఏజెన్సీలు)