Dr BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో క్రీడా పోటీలు ప్రారంభం, ప్రత్యేక గ్రౌండ్ ఏర్పాటుకు విసి వెల్లడి

హైదరాబాద్ : భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘాల అధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామా రావు వర్సిటీ ప్రాంగణంలో ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రతి రోజు వ్యాయామం చేయాలనీ , క్రీడల్లో పాల్గొనాలని అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఎలాంటి అలసట లేకుండా పనులు చేయవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే యూనివర్సిటీ ప్రాంగణంలో క్రీడలకు ప్రత్యేక గ్రౌండ్ ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఏ.వి.ఆర్.ఎన్. రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. భోదనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వీ.ఎం. శర్మ, క్రీడా-కార్యదర్శిలు ఎం. బుద్ధా, ఎన్. మహేష్ బాబు, విశ్వనాథ్ , ఇతర సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

BRAOU V.C INAUGURATED CULTURAL AND SPORTS MEET

Hyderabad : Prof. K. Seetharama Rao, Vice-Chancellor, of Dr. B. R. Ambedkar Open University (BRAOU) today Inaugurated “Cultural & Sports Meet” in connection with Dr. B. R. Ambedkar 133rd Birthday Celebrations at its campus, Jubilee Hills, on a grand scale.

Prof. A. V. R. N. Reddy, Registrar, BRAOU was the Guests of Honors for the program. All Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching Staff Members participated in the Inauguration function. G. Mahesh Goud, President, VM. Sarma, General Secretary, M. Budha and N Mahesh Babu, sports secretaries other Office bearers Co-ordinated the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X