వైద్యులు దేవుడితో సమానం : మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ

హైదరాబాద్ : రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇండియా (ఆర్ ఎస్ ఎస్ డి ఐ) ఆధ్వర్యంలో మ్యారిగోల్డ్ హోటల్ లో డయాబెటిస్ అంశంపై రెండు రోజుల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం సంస్థ సావనీర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ డయాబెటిస్ తగ్గించడంలో డైటీషియన్ల పాత్ర కూడా చాలా ఉంటుంది అని అన్నారు. పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. గతంలో వయసు పైబడిన వారికి మాత్రమే డయాబెటిస్ బారిన పడేవారని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల నుంచి యువకులు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని కానీ దాన్ని నమ్ముకొని ఉండలేమని హ్యూమన్ ఇంటలిజెన్స్ ని మించింది అయి ఉంటుందని తాను భావించడం లేదని అన్నారు. ఏదేమైనాప్పటికీ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.

వైద్యులు దేవుడి తర్వాత దేవుడులాంటి వారిని వైద్యో నారాయణ హరి అని అందుకే అంటారని అన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చునని అన్నారు. మెడికల్ ప్రొఫెషనల్ కాని వారు చెప్పే అనవసర డైట్ ల వల్ల సమాజానికి, ప్రజలకు చాలా హాని జరుగుతుందని అలాంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. తాను కూడా 30 ఏళ్లుగా డయాబెటిస్ తో మందులు వాడుతున్నానని అన్నారు. డాక్టర్లు లాయర్ల కంటే కూడా ఎంతో ప్రాక్టికల్ గా ఉంటారని చమత్కరించారు.

వైద్యులకు ఎన్నో కష్టాలు ఉంటాయని 13 ఏళ్ల పాటు వివిధ కోర్సులు చదివితే కానీ మంచి అవకాశాలు రావని అన్నారు. డాక్టర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకే వారిని దేవుళ్ళతో పోలుస్తారని అన్నారు. దేశం లో 77 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారని అన్నారు. ఇది ఆందోళన కలిగించే నెంబర్ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు డయాబెటిస్ కోసం నెలకు వేళల్లో ఖర్చు పెడుతున్నారని అన్నారు. దీన్ని తగ్గించేందుకు వైద్యులు కృషి చేయాలని వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులు అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా డయాబెటిస్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యం, నూతన విధానాలు, పద్ధతులు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంశాలపై సదస్సులో పాల్గొన్న ప్రముఖ వైద్యులతో పాటు, రీసర్చ్ వైద్యులు మాట్లాడారు. డయాబెటిస్ వస్తున్న సవాళ్లను వాటిని పరిష్కరించే విధానాలను ప్రముఖంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ డి ఐ చైర్మన్ డాక్టర్ లిల్లీ రోడ్రిగస్, సెక్రటరీ డాక్టర్ నవల్ చంద్ర, సైంటిఫిక్ చైర్మన్ ఎంఎన్ శ్యాం సుందర్, డాక్టర్ ఉదయ్ లాల్ చైర్మన్ ఎలక్ట్ తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X