Hyderabad : ప్రజా కవి, ప్రఖ్యాత రచయిత శ్రీ కాళోజి నారాయణ రావు 109వ జయంతిని పురస్కరించుకుని డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. “శ్రీ కాళోజి నారాయణ రావు” చిత్రపటానికి పుష్ప నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి, సీఎస్టీడీ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎన్సీ వేణుగోపాల్, యూనివర్సిటీ ఇంజనీర్ లక్ష్మి ప్రసాద్, యూనియన్ నేతలు డా. యాకేష్ దైద, రామారావు, బోధన మరియు భోదనేతర సిబ్బంది, అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పుష్ప నివాళి అర్పించారు.