రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలనుందా? 45 రోజుల పాలన గురించి ప్రజాభిప్రాయాలు

[గమనిక: వ్యాసంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు రచయిత యొక్కఆలోచనలు. ఈ ఆలోచనతో ఎడిటర్ ఏకీభవించనవసరం లేదు]

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలనుంది అని అనడానికి/చెప్పడానికి కొన్ని సాక్షాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతూ ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నో చూసాం. నాలుగు- ఐదు నెలల్లో పడిపోయే ప్రభుత్వాలను గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎంత కాలం ఉంటుందో మనము చూద్దాం, అంటూ మాట్లాడిన వాక్యాలు కొత్త ఆసక్తిని రేపాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడం ఆ తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంచిన కూడా మిగిలిన పథకాలు అమలు చేయడంలో ఎంతవరకు సఫలమవుతారు అనే విషయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయాల ప్రకారం గ్రామాలలో కరెంటు కోతలు మొదలయ్యాయని ఇలా చేస్తే పంటలు పండడం కష్టమవుతుందని దాంతో నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అంచనా వేస్తున్నారు.

నిజంగానే అందరూ అనుకున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిత్యావసర ధరలు, బియ్యం ధరలు చాలా వరకు పెరిగాయి. అలాగే గ్రామాలలో రైతులకు కరెంటు ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కాస్త హర్షించదగిన విషయం. ఈ పెట్టుబడుల వల్ల ఆ సంస్థలు తెలంగాణలో అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారు. అయితే ప్రజల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నిరాసక్తత ఆగ్రహం మొదలైందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వేల విషయం పక్కన పెడితే, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అని చాలా నమ్మకంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ వాళ్లు లోక్ సభ ఎన్నికలలో గెలవడానికి నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహించడం చాలా గట్టిగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

కాబట్టే కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నా కూడా ఈ సమావేశాలకు హాజరవుతారని హరీష్ రావు గారు తెలిపారు. ఇక కేసీఆర్ రంగంలోకి దిగితే తన మాటల చాతుర్యంతో తనకున్న అనుభవంతో పావులు కదిపి ఎలాగోలా పార్లమెంట్ ఎన్నికలలో గెలిచి తీరుతారని ఒక నమ్మకం ఏర్పడుతుంది. అయితే కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కార్యకర్తలు చాలా సూచనలు చేశారు. ఇన్ని రోజులు కార్యకర్తల మాటలు మేము అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పటినుంచి ప్రతి కార్యకర్త చెప్పిన సూచనలను కచ్చితంగా పాటిస్తామంటూ టిఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట వేశారు. చిన్న కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకు అందరి అభిప్రాయాలు సేకరించి పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు పోటీ చేయాలనే దానిపై చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏకగ్రీవంగా కేసీఆర్ ని పార్లమెంటుకు పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరోవైపు రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో పర్యటిస్తూ అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రావాల్సిన నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. దీన్ని బట్టి నాలుగు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా సమాచారం. ఏ అనుభవం లేని, కొన్ని కేసులలో ఉన్న రేవంత్ రెడ్డి పై కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అనుభవం లేని రేవంత్ రెడ్డికి సీఎం పదవిని ఇచ్చి అందలం ఎక్కించారని సీనియర్ నేతలు కార్యకర్తల ముందు ఏడ్చినట్టుగా, బాధ పడ్డట్టుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ తాము సీఎం అయితే బాగుండేది మా సీనియర్ నేతలకు ఇవ్వకుండా అనుభవం లేని వ్యక్తికి ఇచ్చారని కొంతమంది రేవంత్ రెడ్డికి ప్రతికూలంగా ఉన్నారు.

ఈ విషయం నిజం అయితే ఒకవేళ గనుక కేసీఆర్ రంగంలోకి దిగితే ప్రస్తుతం ఉన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు రహస్య సమాచారం. అలాగే ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని చాలా వరకు వెల్లడిస్తున్నారు పదేళ్ల పాలనలో కేసీఆర్ తిన్నా అవినీతి సొమ్మంతా కక్కిస్తాము అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం అనే మాటలను పక్కనపెట్టి కేవలం కాళేశ్వరం గురించి మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాత్రమే మంత్రులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పైగా సిబిఐ ఎంక్వయిరీ చేయిస్తామని చెప్పి కూడా ఇంకా ఏ చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ప్రతిసారి ప్రతి నిర్ణయానికి ఢిల్లీకి వెళ్లి రావడం వాళ్ల విమానపు ఖర్చులు వారి ఆహార ఖర్చులు కలిపితే ఇక్కడి ఉద్యోగులకు లేదా ప్రజలకు హామీలు అమలు అవుతాయని ఒక అభిప్రాయం కూడా ప్రజలకు ఉంది. విదేశాల్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారనే దాన్ని పక్కన పెడితే అసలు పెట్టబడులు నిజంగా వస్తాయా రావా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. ముఖ్యంగా ఇక్కడి ప్రజల సమస్యలన్నీ పక్కనపెట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం అక్కడే కొన్ని రోజులు ఉండడంవల్ల ఇక్కడి పాలన ఎవరు చేస్తారు అనే ప్రశ్న ప్రజలను తోలుస్తుంది.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను పూర్తి చేస్తాం అనే మాటలను పక్కనపెట్టి కేవలం రెండు హామీలను మాత్రమే ప్రకటించి మిగిలిన వాటి గురించి పట్టించుకోకపోవడం మాట దాటవేయడం కూడా ప్రజలను అసహనానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి పాలన ఇలాగే కొనసాగితే కేసీఆర్ రంగంలోకి దిగి తన మాటలు చాతుర్యంతోను డబ్బుతోను ఎమ్మెల్యేలను కొని అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కూడా ఉంది. ఇదే గనక నిజమైతే ఇన్నేళ్లు కష్టపడినా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించడం లేదు.

అంతర్గతంగా కోపతాపాలు ఉన్న బయటకు మాత్రం అందరూ ఒకేలా స్పందిస్తూ రేవంత్ రెడ్డికి వత్తాసు పలకడానికి కారణం కేవలం రాహుల్ గాంధీ అని మాత్రం చెప్పవచ్చు. బీఆర్ఎస్ వాళ్లు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు నెలలకు ఒక సీఎం మారతారు అనే మాటను ఇప్పుడు నిజం చేస్తారా అనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది. ఇలా ఆరు నెలలకు ఒకసారి సీఎంలు మారితే వారిలో వారికి గొడవలు జరగడం ఖాయం. ఈ సీఎం రేసులో ముందుగా ఉన్నది ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అలాగే జగ్గారెడ్డి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని భోగట్టా. సీఎంలు మారితే పథకాలు కూడా మారుతాయి వారికి అనుకూలంగా ఉన్న పథకాలను మాత్రమే వాళ్లు అమలు చేయడం జరుగుతుంది.

ఈ నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకొని వారిలో వారు అంతా ఏకమైతేనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది తప్ప లేదంటే అవిశ్వాస తీర్మానం వల్ల మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ కాస్త అసంతృప్తితో ఉన్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటిస్తానని అలాగే గ్రూప్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పడం కొంత ఆశాజనకంగా ఉన్నా అది ఎంతవరకు అమలవుతుంది అనేది ఎప్పుడు చేస్తారు అనేది ప్రశ్నార్ధకమే.

కానీ ఇంత చేసినా కూడా మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ప్రభుత్వం ఏర్పాటయి ఇంకా 50 రోజులు కూడా పూర్తికాకుండా అన్ని శాఖల పైన గత ప్రభుత్వం చేసిన అప్పుల పైన ఆరాలు తీస్తూ సమీక్షలు నిర్వహిస్తూ తెలుసుకోవడానికి సగం సమయం సరిపోతుంది. ఆ సమీక్షలు పూర్తయ్యాక కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరువేల లక్షల కోట్లు అప్పు చేయడం వల్ల ఖజానాలో దమ్మిడి ఆదాయం లేదు. అని కాంగ్రెస్ వాళ్ళే బహిర్గతంగా చెప్పారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రాఫిక్ చలానా రూపంలో వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అసలు నిధులే లేనప్పుడు పథకాలు ఎలా అమలు చేస్తారు అనేది ప్రజలకు ఉన్న పెద్ద సందేహం. పాపం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిసి మాట్లాడి ఒప్పందాలు చేసుకుంటూ నిధులు సమకూరే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవేళ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలకు విరక్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులలో తాను కొంత తిన్నా కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు చేసిన కేసీఆర్ ఏ నయమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇవన్నీ కలిసి గుదిబండగా మారిన క్షణాన ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి రెండేళ్ల కన్నా ఎక్కువ పాలన చేయలేడు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాలలో ఉచిత కరెంటును కాకుండా సగం కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు అలాగే పట్టణాలలో కూడా రెండు గంటలు కరెంటు కోతను విధిస్తూ న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అలసత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఎండగట్టి ప్రజల్లో వారి విలువలకు తగ్గేలా చేయడంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తయినా కూడా ఇంకా అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాము అనుకున్నది ఏమిటి చేస్తున్నది ఏమిటి అనేది ఆలోచించుకొని, మణిపూర్ రాహుల్ జూడో యాత్రకు వెళ్లిన రేవంత్ రెడ్డి తొందరగా తిరిగి వచ్చి అన్ని శాఖలను ప్రక్షాళన చేసి, అనుకున్నట్టుగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తే అప్పుడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు అని అనడంలో అతిశయోక్తి లేదు.

కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు గొడవలు అనే అపవాదు ప్రజల్లో ఉంది. దాన్ని నిజం చేయకుండా అంతా ఒక మాట పై ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ఆలోచించి పనులు చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఢిల్లీ వెళ్లడం అధిష్టానం చెప్పిన ప్రకారంగా నడుచుకోవడం చేయడం వల్ల బీఆర్ఎస్ చెప్పిన మాటలన్నీ నిజమనే నమ్మకం ప్రజల్లో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేలను కొందామా అని చూస్తున్నా కేసీఆర్ కి అవకాశం ఇచ్చినట్లు చేతులారా పదవులను కోల్పోవడం జరుగుతుంది.

రెండు పథకాలు ప్రారంభించినంత మాత్రాన మిగిలిన 4 పథకాలు ఏంటి అనేది పెద్ద ప్రశ్నార్థకం ఈ పథకాలలో మెగా డీఎస్సీ ఒకటి, గ్రూప్స్ పరీక్షలు పెడతాము అని ప్రకటించడం ఒకటి అంటే మొత్తం నాలుగు పథకాలు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది అయితే మరీ ఇంకా రెండు పథకాలు ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఆరు గ్యారెంటీలపై ప్రణాళిక చేపడుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే మాటలు మంత్రులు మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తుంది. అలాగే జిల్లాలను కూడా తీసేస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పట్ల కోపం పెరగడం తప్ప, నమ్మకం అనేది పోతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను కొనడం చాలా తేలికైన విషయం.

ఒకవేళ కేసీఆర్ గారే రంగంలోకి దిగినట్లయితే ఎమ్మెల్యేల అందరినీ కొని, అవిశ్వాస తీర్మానం పెట్టి కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించినా కూడా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. 45 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజాభిప్రాయాలు ఇలా ఉన్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందా? లేదా ఐదేళ్లు సక్రమంగా పరిపాలన కొనసాగిస్తారా అనేది ప్రజల్లో ఉన్న ప్రశ్న? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు.

రచయిత్రి భవ్య చారు (7730092871)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X