హైదరాబాద్: అతి తక్కువ ఖర్చు తో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అని, ఉన్నత విద్యలో స్థూల జాతీయ నమోదులో 12 శాతంతో అత్యధికంగా ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయం అని జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ. ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో శనివారం మధ్యాహ్నం 1:00 నుండి 1:30″ వరకు నిరసనను కొనసాగించారు.
జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం లక్షల మంది విద్యార్థులకు తన నిరంతర సేవలను అందించిందని, 85% మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
Also Read-
ఈ కార్యక్రమంలో జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్ జేఎసీ నేతలు డా.యాకేష్ దైద; కాంతం ప్రేంకుమార్; ప్రొ. పుష్పా చక్రపాణి; డా. అవినాష్; డా. కిషోర్; డా. ఉదయుని, విశ్వవిద్యాలయ మాజీ ఉద్యోగులు ప్రొ. ఎస్. వి. రాజశేఖర్ రెడ్డి; లక్శ్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
