हैदराबाद : नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली ने पद से इस्तीफा दे दिया है। राजधानी काठमांडू समेत मुल्क के कई शहरों में हिंसक प्रदर्शन जारी हैं। राष्ट्रपति समेत कई बड़े नेताओं के घर आग के हवाले कर दिए गए हैं। साथ ही प्रदर्शनकारी संसद भवन में भी प्रवेश कर गए हैं। इसी क्रम में प्रधानमंत्री ओली देश छोड़कर जाने की तैयारी में होने की खबर आई है। इस समय सेना ने अपनी हाथ में सत्ता को लिया है। शाम को देश के लिए नये प्रधानमंत्री की घोषणा किये जाने की संभावना है।

Gen Z के बैनर तले प्रदर्शनकारियों ने राजधानी के कई हिस्सों में ‘केपी चोर, देश छोड़ो’ और ‘भ्रष्ट नेताओं के खिलाफ कार्रवाई करो’ जैसे नारे लगाए। प्रदर्शनकारियों ने भक्तपुर के बालकोट स्थित प्रधानमंत्री ओली के आवास को आग लगा दी। ओली फिलहाल बालुवतार स्थित प्रधानमंत्री आवास पर हैं। प्रदर्शनकारियों ने काठमांडू के नायकाप में पूर्व गृह मंत्री रमेश लेखक के आवास को भी आग लगा दी।
Also Read-
सोमवार को सोशल मीडिया साइटों पर सरकार के प्रतिबंध के खिलाफ प्रदर्शन कर रहे युवाओं पर पुलिस द्वारा बल प्रयोग किए जाने के बाद रमेश लेखक ने अपने पद से इस्तीफा दे दिया था। पुलिस की कार्रवाई में सोमवार को 20 लोगों की मौत हो गई थी और 1000 से अधिक अन्य घायल हो गए थे। रविवार शाम से ही सोशल मीडिया बैन के खिलाफ प्रदर्शन शुरू हो गए थे, जो बाद में हिंसक रूप में तब्दील हो गए।
हालांकि, पीएम के पद छोड़ने के चलते नेपाल में सरकार नहीं गिरेगी। पीएम नेपाल की कार्यपालिका के प्रमुख होते हैं, जबकि राष्ट्रपति को सरकार का प्रमुख होने दर्जा प्राप्त है। राष्ट्रपति राम चंद्र पौदल भी पद से इस्तीफा दे सकते हैं। इसे लेकर आधिकारिक तौर पर कुछ नहीं कहा गया है।
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా
హైదరాబాద్ : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ లో హింసాత్మక ఘటనలు తీవ్రస్థాయికి చేరడంతో తన పదవికి రాజీనామా చేశారు ఓలీ. సైన్యం సూచనతో పదవి నుంచి తప్పుకున్నారు. సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది.
సోషల్ మీడియా బ్యాన్ ఎత్తి వేసినా యువత ఆందోళనలు ఆగడం లేదు. పార్లమెంట్ సహా, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేశారు .దీంతో ఓలిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. నేపాల్ లో ఉద్రిక్తత పెరుగుతుండటంతో సరిహద్దులో భద్రత పెంచింది భారత్.
దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోమవారం (సెప్టెంబర్ 8) పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన జడ్ జెన్ యువత.. ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 9) మరోసారి రోడ్డెక్కారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ముందు భారీ ఆందోళన చేపట్టారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సమాచారశాఖ మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని.. ఇప్పటికే విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. యువత నిరసనలతో దేశ రాజధాని ఖాట్మండులో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళనలను అదుపు చేసేందుకు ఖాట్మండులో మరోసారి కర్య్ఫూ విధించారు అధికారులు. యువత డిమాండ్ మేరకు ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ.. ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ప్రొటెస్ట్ కంటిన్యూ చేసింది. జన్ జెడ్ యువత నిరసనలతో ప్రభావంతో ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు రాజీనామా చేశారు. హోంమంత్రి పదవికి రమేష్ అలేఖ్, వ్యవసాయ మినిస్టర్ పోస్ట్‌కు రామ్‌నాధ్ అధికారి రిజైన్ చేశారు. తాజాగా ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. (ఏజెన్సీలు)
