N Ramchander Rao Expressed Deep Sorrow Over The Demise Of Renowned Poet Andesri And…

Hyderabad: State BJP President N. Ramchander Rao expressed deep sorrow over the demise of renowned poet Andesri garu, whose literary contributions and powerful songs played a vital role in inspiring the Telangana movement.

In his message, Ramchander Rao said, “Andesri garu was not just a poet but a people’s voice. Through his words, he awakened the spirit of Telangana and gave poetic expression to the emotions of the people. His passing is an irreparable loss to Telugu literature and Telangana’s cultural identity.”

He further added that Andesri garu was a close friend and a source of inspiration to many who believed in the strength of art, culture, and language in shaping public consciousness.

Sri Ramchander Rao conveyed his heartfelt condolences to the bereaved family members, friends, and admirers of Andesri garu and prayed for his soul to rest in peace. Om Shanti.

Also Read-

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు సంతాపం.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గారి మృతి పట్ల బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

“అందెశ్రీ గారు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి. ఆయనతో చాలాకాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఇటీవల ఢిల్లీలో కలిసినప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అందెశ్రీ గారి మరణవర్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

తెలంగాణ ఉద్యమ దశలో ప్రజల్లో ఆత్మగౌరవ స్పూర్తిని రగిలించిన ఆయన రచనలు చిరస్మరణీయo.ముఖ్యంగా ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ రాష్ట్ర గీతంగా చరిత్రలో నిలిచిపోయింది.

అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నానని రాంచందర్ రావు గారు తెలిపారు. ఓం శాంతి.

ప్రముఖ కవి ‘అందెశ్రీ’ మరణంపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సంతాపం

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మృతి తీవ్ర విచారకరం. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ గారు. మరీ ముఖ్యంగా ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’.. తెలంగాణ ఉద్యమానికి ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో, తదనంతరం.. తెలంగాణ జాతిని జాగృతం చేసే విషయంలో.. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, తెలంగాణ సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని రాజీ పడకుండా విస్పష్టంగా చెప్పారు అందెశ్రీ గారు. తన రచనలతో తెలంగాణ సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రాసుకున్నారు.

జీవితాంతం తెలంగాణ కోసమే పనిచేసిన సౌమ్యుడు, మంచి మనిషి అయిన అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.

అందెశ్రీ గారి మరణం సాహితీ లోకానికి తీరని లోటన్న కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, సహజ కవి అందెశ్రీ గారు స్వర్గస్తులు కావడాన్ని తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక విషయాలను ముక్కుసూటిగా చెప్పే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అందెశ్రీ గారు. వారు రాసిన అనేక పాటు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి. మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అంటూ, జయ జయహే తెలంగాణ వంటి అద్భుతమైన పాటలను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ గారితో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. పోరు యాత్రలో చాలా సభల్లో అందెశ్రీ గారు పాల్గొనే వారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులపై పరిశోధన చేసి పుస్తకం రాయాలనే సంకల్పంతో ఆయన అనేక పరిశోధనలు చేశారు. ఈ సమయంలో అమెరికాలో వారితో కలిసి పర్యటించే అవకాశం నదులపై చర్చించే అవకాశం లభించింది దురదృష్టవశాత్తు ఆ పుస్తకం పూర్తి కాకుండానే వారు మనకు దూరమయ్యారు. నరేంద్రమోదీ గారంటే అందెశ్రీ గారికి ఎంతో అభిమానం. అనేకసార్లు మా ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించుకునేవాళ్లం. అలాగే అందెశ్రీ గారు నాకు సలహాలు కూడా ఇచ్చేవారు. చాలా పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి.. గ్రామీణ ప్రాంతాల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సమాజంలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రతి క్షణం ఆలోచించేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X