పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిమ్ సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలన్నారు.

సీఎం కెసిఆర్ తరచూ చెప్పే, తెలంగాణకే తల మానికమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కెసిఆర్ మొదలు పెట్టారన్నారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి 2008 నుండి 2014 మద్యకాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, గత ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 116 రూపాయల సహాయం షాదీ ముబార‌క్ పథకం ద్వారా అందజేస్తున్నదని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మసీదులలో ప్రార్థనలు చేసే 10 వేల మంది ఇమామ్ లకు ప్రతినెలా 5 వేల రూపాయల భృతి అందించబడుతున్నదని అన్నారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇమామ్, మౌజన్ లకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల భృతిగా చెల్లించిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ వర్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం 53 కోట్ల రూపాయల గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఉర్దూ అకాడమీ నిర్వహణకు 40 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన వివరించారు.

మంత్రి జగదీష్ రెడ్డి

సర్వమత సమ్మేళనానికి తెలంగాణా ప్రతీక

గంగా,జమునా, తహజీబ్ లకు ఐకాన్

నేటి నుండి (శుక్రవారం) రంజాన్ ఉపవాస దీక్షలు

పరమ పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిన మాసం

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముస్లిం మైనారిటీల పురోగతి

ఉపవాస దీక్షలు భక్తిశ్రద్దలతో తలపెట్టండి

ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం

పేదలకు దుస్తులు ప్రభుత్వ రంజాన్ కానుక

మసీదులు,ఈద్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ముస్లిం మైనారిటీ ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు

మంత్రి జగదీష్ రెడ్డి

సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. గంగా, జమునా తహజీబ్ లకు ఈ ప్రాంతం ప్రత్యేక ఐకాన్ గా ఫరీడ విల్లుతుందని ఆయన పేర్కొన్నారు.రంజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా ఈ శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లిం మైనారిటీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంధం ఆవిర్భావించిన మాసంలో ముస్లిం సోదరులు చేపట్టే ఈ ఉపవాస దీక్షలు ఎంతో ఉన్నతమైనవని ఆయన కొనియాడారు.

అటువంటి దీక్షలను భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం విదితమే నని ఆయన పేర్కొన్నారు. అంతే గాకుండా రంజాన్ పర్వదినం రోజున పేదలకు దుస్తుల పంపిణి వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నీ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిది ఏళ్లుగా ఈద్గాలు, మసీదుల అభివృద్ధి కి చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. వీటన్నింటికి మించి ఉపవాస దీక్షలలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు గాను ప్రత్యేక వెసులుబాటు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. అటువంటి ఉపవాస దీక్షలు భక్తిశ్రద్దలతో నిర్వహించుకొని మతసామరస్యాన్నీ ప్రతిబింబించేలా రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X