हैदराबाद: आंध्र प्रदेश के गुंटूर जिले में हाल ही में हुई सिंगय्या की मौत की जांच ने अहम मोड़ ले लिया है। वाईएसआर कांग्रेस पार्टी के प्रमुख जगन मोहन रेड्डी जिस वाहन में यात्रा कर रहे थे, उसके नीचे कुचले जाने से सिंगय्या नामक व्यक्ति की मौत की घटना को शुरू में लापरवाही से मौत के आरोप में बीएनएस धारा 106 (1) के तहत मामला दर्ज किया गया था।
हालांकि, पुलिस जांच के दौरान सामने आए सीसीटीवी फुटेज, ड्रोन विजुअल और प्रत्यक्षदर्शियों के बयानों के बाद पुलिस इस घटना को संदिग्ध हत्या मान रही है। इसके साथ ही मामले में बीएनएस की नई धारा 105 भी जोड़ दी गई है। इस धारा के अनुसार, अगर अपराध साबित हो जाता है तो आरोपी को आजीवन कारावास के साथ-साथ 5-10 साल की सजा हो सकती है। इसे गैर-जमानती अपराध माना जाता है।
हालांकि पुलिस जांच में सामने आए सीसीटीवी फुटेज, ड्रोन विजुअल और प्रत्यक्षदर्शियों के बयानों की जांच के बाद पुलिस इस घटना को संदिग्ध हत्या मान रही है। इसके साथ ही बीएनएस ने मामले में नई धारा 105 जोड़ दी है। इस धारा के अनुसार, अपराध सिद्ध होने पर आरोपी को आजीवन कारावास के साथ ही 5-10 साल की सजा हो सकती है। इसे गैर जमानती अपराध माना जाता है।
Also Read-
इतना ही नहीं, इस दुर्घटना के सुनियोजित होने के संदेह के मद्देनजर बीएनएस ने धारा 49 भी जोड़ दी है। इस धारा के अनुसार, अपराध के लिए उकसाने, प्रोत्साहित करने या सुझाव देने वालों के खिलाफ भी कार्रवाई की जा सकती है। मीडिया में खबरें आ रही है कि सभी वीडियो साक्ष्यों की जांच के बाद ही यह धारा जोड़ी गई है।
इस मामले में जगन मोहन रेड्डी और कुछ अन्य लोगों के खिलाफ आपराधिक आरोप दर्ज किए गए हैं। फिलहाल मामले की गंभीरता को देखते हुए पुलिस और गहन जांच कर रही है। विश्लेषकों का मानना है कि इस मामले का अगले चरणों में आंध्र प्रदेश की राजनीति पर असर पड़ने की संभावना है।
సింగయ్య మరణ ఘటన కీలక మలుపు, నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు
హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సింగయ్య మరణ ఘటనకు సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మొదట నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారన్న ఆరోపణలతో కేసు బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) కింద నమోదు చేశారు.
అయితే పోలీసు దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీ టీవీ ఫుటేజీ, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహపూరిత హత్యగా పరిగణిస్తున్నారు. దాంతో బీఎన్‌ఎస్ కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదుతో పాటు 5–10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది.
ఇది మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బీఎన్‌ఎస్ సెక్షన్ 49 కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ ను చేర్చినట్లు సమాచారం.
ఈ కేసులో జగన్‌మోహన్ రెడ్డి సహా మరికొంతమంది వ్యక్తులపై నేరారోపణలు పెట్టారు. ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా పోలీసు వర్గాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నాయి. తదుపరి దశలలో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)
