तेलंगाना में तेज हवा, बिजली गिरने और बारिश से भारी तबाही, 14 लोगों की मौत

हैदराबाद : तेलंगाना के कई जिलों में रविवार शाम को तेज हवाओं और बिजली गिरने के साथ भारी बारिश हुई। दीवारें गिरने, पेड़ उखड़ने और बिजली गिरने से कुल 14 लोगों की मौत हो गई। तेज हवा से नागरकर्नूल और सिद्दीपेट जिलों में भारी तबाही हुई। नागरकर्नूल जिले में 8 लोगों की मौत हो गई। तेज हवाओं के कारण कई पेड़ गिर गये।

शहर में लगाये गये फ्लेक्सी और होर्डिंग्स बिजली के तारों पर गिर गये। नागरकर्नूल जिले के ताडुरू मंडल केंद्र में इंद्रकल रोड पर मुर्गी फार्म शेड की दीवार गिर गई। इस हादसे में मालिक मल्लेश और उनकी बेटी अनुषा के साथ नागरकर्नूल से आये मजदूर चेनम्मा और रामुलु की मौके पर ही मौत हो गई। जबकि छह अन्य घायल हो गए। तेज हवा और बारिश के चलते वे सभी शेड में ठहरे थे और इस समय दीवार उन पर गिरने से यह हादसा हो गया। घायलों को नजदीकी अस्पताल में भर्ती कराया गया है और उनका इलाज किया जा रहा है। इसी जिले के तेलकपल्ली मंडल केंद्र में लक्ष्मण (13), बिजिनेपल्ली मंडल के नंदी वड्डेमान गांव में गोपाल रेड्डी (45) और तिम्माजीपेटा मंडल के मारेपल्ली गांव में वेंकटय्या (50) नामक किसानों की बिजली गिरने से मौत हो गई। नागरकर्नूल जिला केंद्र के पास मंतटी चौरास्ता में एक कार में बैठे हुए वेणुगोपाल की अप्रत्याशित रूप से जान चली गई। वेणुगोपाल की मृत्यु तब हुई जब कार के बगल की टीन्स और शेड की ईंटें कार की शीशे पर गिरीं और शीशे में वेणुगोपाल के शरीर घुस जाने से उनकी जान चली गईं।

संबंधित खबर-

इसके अलावा, सिद्दीपेट जिले के मुलुगु मंडल के क्षीरसागरम गांव में भारी बारिश के कारण मुर्गी फार्म की दीवार गिरने से गंगापुर गांव के गंगा गौरीशंकर (30) और भाग्यम्मा (40) की मौत हो गई। शाम की शुरुआत बूंदाबांदी से हुई और बाद में हवा तेज होने से अचानक स्थिति बदल गई। उस वक्त सड़कों पर मौजूद लोग दौड़ पड़े. अधिकारी सड़कों पर गिरे पेड़ों को हटा रहे हैं। बिजली कर्मचारी युद्ध स्तर पर गिरे हुए पोल और टूटे तारों की मरम्मत कर रहे हैं। तेज़ हवाओं और भारी बारिश के कारण शामीरपेट के कीसरा रोड पर एक बाइक पर पेड़ गिरने से दो लोगों की मौत हो गई। यादाद्री-भुवनगिरी जिले के बोम्मला रामाराम मंडल केंद्र निवासी नागिरेड्डी रामरेड्डी (48) और उसी मंडल के आदिपुरम गांव निवासी धनुंजय एक वकील से बात करने के लिए बाइक पर इंट्रा गांव से शामीरपेट के लिए रवाना हो गये।

जैसे ही वे तिम्मईपल्ली के पास पहुंचे, हवा के झोंके में एक पेड़ टूट गया और जिस बाइक पर वे यात्रा कर रहे थे, उस पर गिर गया। परिणामस्वरूप, नागिरेड्डी रामरेड्डी की मौके पर ही मौत हो गई, धनुंजय अस्पताल में इलाज के दौरान उनकी मौत हो गई। इसके अलावा रविवार शाम को रंगारेड्डी जिले के सेरिलिंगमपल्ली में तूफान ने तबाही मचा दी। भारी बारिश के कारण ओल्ड हाफ़िज़पेट साईंनगर में एक घर की चौथी मंजिल की दीवार ढह गई और पड़ोसी घर पर गिर गई, जिससे तीन वर्षीय लड़के की मौत हो गई। मोहम्मद अब्दुल समद के माता-पिता यूपी निवासी हैं। वे सड़क के किनारे कपड़े का व्यापार करते हैं। हादसे के वक्त वे बाहर थे। उसी सड़क पर एमडी राशिद (45) नाम का शख्स जो बाइक से जा रहा था, उसके ऊपर घर की दीवार ढह कर ईंटे गिर गई। सिर में गंभीर चोट लगने के कारण अस्पताल में इलाज के दौरान उनकी मौत हो गई।

తెలంగాణలో గాలివాన బీభత్సం, 14 మంది మృతి

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్​కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

పట్టణాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు కరెంట్ లైన్ల మీద పడిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ రోడ్డులో కోళ్ల ఫారమ్ షెడ్డు గోడ కూలి ఓనర్ మల్లేశ్, ఆయన కూతురు అనూషతోపాటు పని చేసేందుకు నాగర్​కర్నూల్ నుంచి వచ్చిన అడ్డా కూలీలు చెన్నమ్మ, రాములు అక్కడికక్కడే చనిపోగా, మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. గాలివాన రావడంతో వీరంతా షెడ్డులో తలదాచుకోగా, గోడకూలి మీదపడడంతో ప్రమాదం జరిగింది. గాయపడినవారిని సమీప దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. పిడుగులు పడి ఇదే జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్(13), బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలో గోపాల్ రెడ్డి (45), తిమ్మాజిపేట మండలం మారెపల్లిలో వెంకటయ్య (50) అనే రైతులు చనిపోయారు. నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రానికి సమీపంలోని మంతటి చౌరస్తా వద్ద కారులో కూర్చున్న వేణుగోపాల్ అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కారు పక్కనే ఉన్న రేకుల షెడ్డు ఇటుకలు ఎగిరి గ్లాస్​పై పడగా, అద్దాలు గుచ్చుకోవడంతో వేణుగోపాల్ మృతిచెందాడు.

అలాగే సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగరం గ్రామంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కోళ్ల ఫారం గోడ కూలి తూఫ్రాన్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్ (30), భాగ్యమ్మ (40) మృతిచెందారు. సాయంత్రం చినుకులతో మొదలైన వానకు గాలి తోడవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలో రోడ్ల మీద ఉన్నవారు పరుగులు తీశారు. అధికారులు రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్​సిబ్బంది కూలిన స్తంభాలు, తెగిన తీగలను యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షంతో శామీర్ పేట్ లోని కీసర రహదారి పై ప్రయాణిస్తున్న బైకుపై చెట్టు కూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (48), అదే మండల పరిధిలోని ఆదిపురం గ్రామానికి చెందిన ధనుంజయ ఓ లాయర్ తో మాట్లాడేందుకు బైకుపై ఇంట్ర గ్రామం నుంచి శామీర్ పేట వైపు బయలుదేరారు.

తిమ్మాయిపల్లి సమీపంలోకి రాగానే ఈదురుగాలులకు చెట్టువిరిగి, వారు ప్రయాణిస్తున్న బైకుపై పడింది. దీంతో నాగిరెడ్డి రాంరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు.. ధనుంజయ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అలాగే, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో ఓల్డ్ హఫీజ్​పేట్ సాయినగర్​లోని ఓ ఇంటి నాల్గవ అంతస్తు గోడ కూలి పక్కనే ఉన్న రేకుల ఇంటిపై పడటంతో మూడేండ్ల బాలుడు చనిపోయాడు. మహ్మద్ అబ్దుల్ సమద్ అనే ఆ బాలుడి తల్లిదండ్రులు యూపీకి చెందినవారు. రోడ్డు పక్కన బట్టల వ్యాపారం చేస్తుంటారు. ప్రమాద సమయంలో వారు బయట ఉన్నారు. ఇదే దారిలో బైకుపై వెళ్తున్న ఎండీ రషీద్ (45) అనే వ్యక్తిపైనా ఇంటి గోడ కూలి ఇటుకలు మీద పడ్డాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

బీభత్సం

హైదరాబాద్ సిటీ శివారులో గంటపాటు ఈదురు గాలుల, ఉరుములు, మెరుపులతో  కురిసిన వాన బీభత్సం సృష్టించింది. దీంతో  చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ  కొట్టి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.  చెట్లు, కొమ్మలు విరిగడమే కాకుండా విద్యుత్ తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. వనస్థలిపురంలో సుష్మా వద్ద మన్సూరాబాద్ వెళ్లే రూట్ లో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో అటు నుంచి వెళ్తున్న యువతి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద ఆంబులెన్స్ పై చెట్టు కొమ్మ, గణేష్ టెంపుల్ వెనక  చెట్టు కొమ్మ విరిగి పడ్డాయి. వనస్థలిపురంలోనే ఓ కారుపై గోడ కూలి పడడంతో ధ్వంసమైంది. మన్సూరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్ లో రోడ్లపై చెట్ల కొమ్మలు పడ్డాయి. మన్సూరాబాద్ లో రెండు చెట్లు కూలడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ అంతరాయం  ఏర్పడింది. గౌరెల్లి, ప్రతాప సింగారం గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం కూలి రోడ్డుపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రావినారాయణ కాలనీలో సుమారు 500 పేదల గుడిసెలు గాలివానకు కప్పులు ఎగిరిపోయాయి. ఘట్ కేసర్ మండలంలో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు లేచిపోవటంతో పాటు చెట్లు,  ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు కూలిపోయాయి. ప్రతాపసింగారంలో 5 ఇండ్ల పై కప్పులు లేచి పోగా గోడలు కూలాయి. మర్పల్లిగూడలో తాటి చెట్టు నేలకొరింది. అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ తో పాటు విద్యుత్ స్తంభాలు, ఘట్ కేసర్ లో విద్యుత్ వైర్లు, హోర్డింగ్ లు కూలాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X