‘T’ Government’s Inhumane Response To Maternal And Infant Deaths At Gandhi Hospital: KTR

The government is focusing on defaming the opposition rather than addressing the issue at hand, says KTR.

Hyderabad: K. T. Rama Rao, the Working President of the Bharat Rashtra Samithi (BRS), has announced the formation of a fact-finding committee on behalf of the party to investigate the ongoing maternal and infant deaths at Gandhi Hospital. This committee, composed of experts, will conduct a detailed study of the situation and share its findings with both the government and the public. KTR urged the government to cooperate with this initiative and to accept the advice and suggestions provided by the opposition in order to improve public health.

KTR expressed his disappointment with the government’s focus on retaliating against the BRS for bringing this issue to light, instead of addressing the core problem. He criticized the government for diverting attention away from solving the issue and instead engaging in blame games. He questioned whether the government had conducted any review on the deaths or taken steps to ensure quality healthcare. KTR also raised concerns over the alleged transfer of senior doctors from the hospital, which may have caused disruptions in providing medical services. He urged the government to address this issue and make efforts to reduce the mortality rate.

KTR expressed his anger, stating, “Are you blaming us for raising the issue that infants are dying without proper medical care?” He further questioned the government’s claims, saying, “If the BRS was really trying to favor private hospitals, why would we build large public hospitals around Hyderabad, construct the largest hospital in Warangal, establish Basti Dawakhanas, and clinics in rural areas? Would we have set up 33 medical colleges when there were only two earlier?”

KTR advised the government to focus on correcting its own shortcomings rather than attacking the opposition. He urged the administration to act with humanity, reminding them that the lives lost cannot be brought back, and that every life is precious. He stressed that the deaths in government hospitals should not be seen as mere numbers but as the loss of a child or mother from a family and that the government should approach the issue with compassion. KTR criticized the government’s lack of empathy, stating that it is shameful that the administration treats these deaths as mere statistics, without considering the deep personal loss experienced by the families involved.

Also Read-

గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలపైన ప్రభుత్వం అమానవీయంగా స్పందిస్తున్నది- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సమస్య పరిష్కారం పైన దృష్టి సారించాల్సింది పోయి ప్రతిపక్షాల పైన బురదజల్లే కార్యక్రమానికి ప్రయత్నం చేస్తున్నది

మరణాలను అరికట్టడం చికిత్సలను మెరుగుపరచడం పైన దృష్టి సారించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంపై కేటీఆర్ ఆగ్రహం

ఈ అంశంలో పార్టీ తరఫున ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన కేటీఆర్

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న మాతా శిశు మరణాల పైన భారత రాష్ట్ర సమితి తరఫున ఒక నిజ నిర్ధారణ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని) ఏర్పాటు చేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ తరఫున ఏర్పాటు చేయనున్న ఈ నిపుణుల కమిటీ గాంధీలో జరుగుతున్న మరణాలపైన అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతోపాటు ప్రజలతోనూ పంచుకుంటామన్నారు. పార్టీ తరఫున చేసే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కలిసి రావాలని ప్రజల ఆరోగ్యాలను బాగుపరిచేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు సూచనలను స్వీకరించాలని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపైన దృష్టి సారించాల్సింది పోయి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన బిఆర్ఎస్ పైన ఎదురుదాడికి దిగడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాల్సింది పోయి సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్ప‌టికైనా మ‌ర‌ణాల‌పై రివ్యూ చేశారా…? నాణ్య‌మైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా… లేదా? మొన్న‌టి బ‌దిలీల్లో సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను బదిలీపై పంపార‌న్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉందా… లేదా? అనే ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీ చేయడం వలన అక్కడ చికిత్సలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని విషయాన్ని గుర్తించాలని దీని అరికట్టి మరణాలను తగ్గించే ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు.

వైద్యం అంద‌టం లేదు… పసి పిల్ల‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు మ‌హ‌ప్ర‌భో అంటే బుద‌రజ‌ల్లుతున్నారని మాట్లాడ‌తారా? అంటూ మండిపడ్డారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాల‌నుకుంటే… హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుప‌త్రులు, వ‌రంగ‌ల్ లో నిర్మాణం న‌డుస్తున్న అతిపెద్ద ఆసుప‌త్రి, బ‌స్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసే వాళ్ల‌మా? కేసీఆర్ కిట్లు, త‌ల్లి-బిడ్డ‌ను ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టేలా వాహ‌నాలు, సాదార‌ణ ప్ర‌స‌వాలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం, రెండు ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీలు ఉన్న చోట 33మెడిక‌ల్ కాలేజీల ఏర్పాట్లు జ‌రిగేవా? అని కెటిఅర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మాపై ఎదురుదాడి త‌ర్వాత‌, ముందుగా మీ పాల‌న‌లో ఉన్న లోపాలు స‌రిదిద్దుకోవాలని కెటిఅర్ సూచించారు. పోయిన ప్రాణాలు తిరిగి రావు… ఆ త‌ల్లుల క‌డుపుకోత తీర్చ‌లేమనే సోయితో అలోచించి, ప్ర‌జ‌లు కూడా మ‌న బిడ్డ‌లే అని మాన‌వ‌త్వంతో ఆలోచిస్తే మీ పాల‌న తీరు కూడా మారుతుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలు ఒక సంఖ్యగా మాత్రమే కనిపించడం దారుణమని అది ఒక కుటుంబానికి సంబంధించిన శిశువు లేదా తల్లి మరణం అనే మానవీయమైన కోణంలో ఆలోచించాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న మరణాలు ఒక కుటుంబ భవిష్యత్తు అనే కనీస సొయి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X