మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి కన్నుమూత, CM సంతాపం

హైదరాబాద్: మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. పీసీసీ అధ్యక్షులు 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసిన నర్సారెడ్డి ((92), జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పని చేసారు. నిర్మల్ కు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు.

నర్సారెడ్డి నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామంలో 1931సెప్టెంబర్ 22న జన్మించారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో B.A, L.L.B పట్టాలు పొందారు.   స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.  1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా సేవలందించారు.

1978లో మాజీ సీఎం జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ మరియు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా  పనిచేశారు.  1991లో ఆదిలాబాద్ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  

నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన అనుభవాలు మాకు మార్గదర్శకంగా ఉండేవి. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ప్రజల మనిషి, నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్

ప్రజల మనిషి, నీతికి నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.

మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పి. న‌ర్సారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి జూప‌ల్లి. మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పి. న‌ర్సారెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ వాదిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందార‌ని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుదీర్గ రాజ‌కీయ జీవితంలో ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించిన న‌ర్సారెడ్డి మృతి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌న్నారు.

నర్సారెడ్డి మృతి పట్ల మాజీ పీసీసీ అధ్యక్షులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం

నిజాయితీగా రాజకీయాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని జీవితాంతం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసిన మాజీ పీసీసీ అధ్యక్షులు పి. నర్సారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పి. న‌ర్సారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

మాజీ పీసీసీ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పి. న‌ర్సారెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి ని తెలిపారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ వాదిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందార‌ని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుదీర్గ రాజ‌కీయ జీవితంలో ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించిన న‌ర్సారెడ్డి మృతి రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌న్నారు.

ఈటల రాజేందర్ సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీగా, ఎంఎల్సీగా, ఎమ్మెల్యేగా, పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించిన నర్సారెడ్డి మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X