बुकिंग के 24 घंटे के भीतर पेयजल टैंकर की डिलीवरी
हैदराबाद : महानगर में गर्मियों में पेयजल की मांग को पार किया है। जल निकाय उस स्तर पर पहुंच गया है जहां ग्राहकों द्वारा टैंकर बुक करने के 24 घंटे के भीतर टैंकर पहुंचा दिया जाता है। पिछले साल बारिश की कमी के कारण हैदराबाद में भूमिगत जल स्तर सूख गया। इसके चलते गर्मी शुरू होने से पहले फरवरी माह से ही पेजजल की मांग होने लगी है। बोरहोल पर निर्भर इलाके के लोग जल मंडल पर निर्भर हैं जो हैदराबाद को पीने के पानी की आपूर्ति कर रहा है। जल बोर्ड की ओर से सप्लाई किए गए टैंकरों की जमकर बुकिंग हुई। खासकर वह स्थिति जब कई इलाकों में 30 हजार से ज्यादा लोग पूरी तरह से टैंकरों पर निर्भर हैं।
హైదరాబాద్ : మహానగరంలో వేసవిలో ఏర్పడ్డ డిమాండ్ ను అధిగమించి. వినియోగదారులు ట్యాంకర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో ట్యాంకర్ డెలివరీ చేసే స్థాయికి జలమండలి చేరుకుంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో వేసవి ప్రారంభం కాకముందే ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ ఏర్పడింది. బోర్లపై ఆధారపడే ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తున్న జలమండలిపై ఆధారపడ్డారు. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లను భారీగా బుక్ చేసుకున్నారు. ముఖ్యమంగా పలు ప్రాంతాల్లోని 30 వేలకు పైగా ప్రజలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడిన పరిస్థితి.
వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్ తో జలమండలి అప్రమత్తమైంది. కానీ రోజు రోజుకీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో 2, 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేసే స్థితి వచ్చింది. ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. జలమండలి ఉన్నతాధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి 24 గంటల్లోపు ట్యాంకర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏకకాలంలో ఎండీ రివ్యూలు – ఆకస్మిక తనిఖీలు
మరోవైపు ఎండీ సుదర్శన్ రెడ్డి పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు.. జలమండలి ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఆయా ప్రాంతాల జీఎంలు, సీజీఎంలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏక కాలంలో రివ్యూలు, ఆకస్మిక తనిఖీలు చేశారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ద్వారా ఆన్ లైన్ మానిటిరింగ్ చేశారు.
ఇది కూడా చదవండి-
జలమండలి తీసుకున్న చర్యలు
వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు జలమండలి నడుం బిగించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్నీ వాడుకుంది.
- అందులో ప్రధానమైనవి ట్యాంకర్ల సంఖ్య పెంచడం. కొత్త ట్యాంకర్ల కొనుగోలుతో పాటు ఇతర సోర్సుల నుంచి అద్దెకు తెచ్చుకోవడం లాంటివి చేసింది.
- రెండోదిగా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను పెంచుకోవడం. సరిపడా ట్యాంకర్లు ఉన్నా ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వేచి చూసే పరిస్థితి ఉండొద్దని వాటితో పాటు ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్యను కూడా పెంచారు.
- మూడోదిగా అదనపు సిబ్బందిని సమకూర్చుకోవడం. ట్యాంకర్లు ఉన్నా.. వాటిని నడిపేందుకు సిబ్బంది లేకపోవడంతో.. జీహెచ్ఎంసీ నుంచి కొంత మంది డ్రైవర్లను సమకూర్చుకున్నారు. దీంతో పాటు వినియోగదారులకు వేగంగా ట్యాంకర్ డెలివరీ చేసేందుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా సిబ్బంది ఏర్పాటు చేసుకున్నారు.
- ట్యాంకర్ డెలివరీ, పర్యవేక్షణ కోసం జలమండలి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. దీంతో పాటు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా “ట్యాంకర్ మేనేజ్ మెంట్ సెల్” ఏర్పాటు చేసింది. ఈ సెల్.. జలమండలి పరిధిలోని వివిధ సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల నుంచి సమన్వయం చేసుకుని వినియోగదారులకు మంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంది.
- అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలు.. ప్రధాన కార్యాలయానికి అనుసంధానం కావడంతో.. వాటిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పర్యవేక్షించారు.
- ట్యాంకర్ బుకింగ్ మొదలు… డెలివరీ వరకు సమాచారిన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జలమండలి ప్రత్యేక యాప్ రూపొందించింది. ఫుడ్ డెలివరీ యాప్ తరహాలో ట్రాకింగ్ యాప్ తయారు చేసింది. దీని వల్ల వినియోగదారులు తాము బుక్ చేసుకున్న ట్యాంకర్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా పలు ఫిల్లింగ్ స్టేషన్స్ లో అమలు చేసి పరీక్షిస్తున్నారు.
ఎమర్జెన్సీ పంపింగ్
హైదరాబాద్ నగర వాసులకు నిరాటంక తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పుడూ కృషి చేస్తుంది. వేసవిలో తలెత్తిన సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాగునీరు సరఫరా చేసేందుకు ఏప్రిల్ 20న నాగార్జున సాగర్ జలాశయంలో 10 పంపులతో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించారు. అవసరాన్ని బట్టి.. ఇటు ఎల్లంపల్లి జలాశయం నుంచి కూడా ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
గతేడాది కంటే అదనపు నీటి సరఫరా
అధిక డిమాండ్ కారణంగా హైదరాబాద్ నగరానికి గతేడాదితో పోలిస్తే.. ఈ వేసవిలో జలమండలి అదనంగా నీటి సరఫరా చేసింది. ఈ వేసవిలో 580 ఎంజీడీల నీటి సరఫరా చేశారు. గతేడాదితో పోలిస్తే.. 20 ఎంజీడీలు అదనపు నీటిని నగర వాసులకు జలమండలి సరఫరా చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక సరఫరా కావడం విశేషం. జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణ, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చి.. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లోగా డెలివరీ చేసే స్థితికి జలమండలి చేరుకుంది.
ట్యాంకర్ బుకింగ్, డెలివరీ సరళి క్ర.సం. వివరాలు, మార్చి 1 నాటికి మే 17 నాటికి
1 మొత్తం ట్యాంకర్లు 584 872
2 ఫిల్లింగ్ స్టేషన్లు 72 89
3 ఫిల్లింగ్ పాయింట్స్ 120 164
4 రోజూవారీ బుకింగ్స్ 3150 4065
5 రోజూవారీ డెలివరీ 4500 6016
6 సరాఫరా చేసిన ట్రిప్పులు 1,70,000 1,41,550