DGP Mahender Reddy : తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక‌ విడుద‌ల, ఈ ఏడాది 431 మందిపై పీడీ యాక్ట్

హైద‌రాబాద్ : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక‌ను గురువారం విడుద‌ల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగింద‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ నేరాలు 57 శాతం, దొంగ‌త‌నాలు 7 శాతం, అప‌హ‌ర‌ణ‌లు 15 శాతం పెరిగాయ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌పై నేరాలు 3.8 శాతం పెరిగాయ‌ని చెప్పారు. హ‌త్య కేసులు 12 శాతం, అత్యాచారాలు 17 శాతం త‌గ్గాయి.

152 కేసుల్లో నిందితుల‌కు జీవిత ఖైదు ప‌డింద‌ని తెలిపారు. డ‌య‌ల్ 100 ద్వారా 13 ల‌క్ష‌ల ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా 1.1 ల‌క్ష‌ల ఫిర్యాదులు రాగా, పోలీసు స్టేష‌న్ల‌లో 5.5 ల‌క్ష‌ల ఫిర్యాదు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు.

సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామ‌ని తెలిపారు. 15 ల‌క్ష‌ల మందికి అవ‌గాహ‌న క‌ల్పించామ‌ని చెప్పారు. గ‌స్తీ వాహ‌నాలు 7 నిమిషాల్లో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని సేవ‌లు అందించే విధంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు. హాక్ ఐ ద్వారా ప్ర‌జ‌లు ఫిర్యాదు చేస్తున్నార‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో 10 ల‌క్ష‌ల‌కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామ‌ని స్ప‌ష్టం చేశారు. వేలి ముద్ర‌ల ద్వారా ఎంతో మంది నిందితుల‌ను గుర్తించామ‌ని పేర్కొన్నారు. 10 ల‌క్ష‌ల మంది అనుమానితుల వేలిముద్ర‌ల‌ను సేక‌రించామ‌ని తెలిపారు. క‌రుడుగ‌ట్టిన నిందితుల‌పై పీడీ చ‌ట్టం ప్ర‌యోగించి నేరాలు అదుపు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ యాక్ట్ ప్ర‌యోగించామ‌ని తెలిపారు. (Agencies)

DGP Mahender Reddy : तेलंगाना पुलिस की वार्षिक रिपोर्ट जारी इस साल 431 लोगों के खिलाफ पीडी एक्ट

हैदराबाद: डीजीपी महेंद्र रेड्डी ने गुरुवार को तेलंगाना पुलिस की सालाना रिपोर्ट जारी किया। उन्होंने बताया है कि तेलंगाना में अपराध का प्रतिशत बढ़कर 4.4 हो गया है। उन्होंने कहा कि साइबर अपराध में 57 प्रतिशत, चोरी में 7 प्रतिशत और अपहरण में 15 प्रतिशत की वृद्धि हुई है। उन्होंने कहा कि महिलाओं के खिलाफ अपराधों में 3.8 प्रतिशत की वृद्धि हुई है। हत्या के मामलों में 12 फीसदी और रेप के मामलों में 17 फीसदी की कमी आई है।

डीजीपी ने कहा कि 152 मामलों में आरोपियों को उम्रकैद की सजा सुनाई गई है। उन्होंने कहा कि डायल 100 के माध्यम से 13 लाख शिकायतें प्राप्त हुई हैं। उन्होंने कहा कि सोशल मीडिया के माध्यम से जहां 1.1 लाख शिकायतें प्राप्त हुईं। वहीं 5.5 लाख शिकायतें पुलिस थानों में दर्ज की गईं।

उन्होंने कहा कि साइबर अपराधों के प्रति जागरूकता पैदा करने के लिए कार्यक्रम चलाए जा रहे हैं। उन्होंने कहा कि 15 लाख लोगों को जागरूक किया जा चुका है। गश्ती वाहन 7 मिनट के भीतर घटनास्थल पर पहुंचकर सेवाएं दे सकें, इसके लिए इंतजाम किए गए हैं। उन्होंने कहा कि हॉक आई के जरिए लोग शिकायत कर रहे हैं।

उन्होंने कहा कि जनभागीदारी से 10 लाख से अधिक सीसी कैमरे लगाए जा चुके हैं। उन्होंने स्पष्ट किया कि सीसी कैमरों के माध्यम से 18,234 प्रकरणों का निराकरण किया जा चुका है। कई आरोपियों की पहचान फिंगर प्रिंट से की गई है। उन्होंने कहा कि 10 लाख संदिग्धों के फिंगरप्रिंट एकत्र किए हैं। उन्होंने कहा कि वे आरोपियों के खिलाफ पीडी एक्ट का प्रयोग कर अपराधों पर नियंत्रण कर रहे हैं। उन्होंने कहा कि इस साल 431 लोगों के खिलाफ पीडी एक्ट का प्रयोग किया गया है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X