ఢిల్లీ లిక్కర్ స్కాం 1100 కోట్ల నేరం, ఇండో స్పిరిట్ కంపెనీకి 192 కోట్ల లాభాలు

हैदराबाद : प्रवर्तन निदेशालय की ओर से आज दायर की गई चार्जशीट में कहा है कि दिल्ली शराब घोटाला कुल 1100 करोड़ का अपराध है। चार्जशीट में कहा गया कि 292 करोड़ रपये में कविता की भूमिका है। एमएलसी कविता ने 33 फीसदी हिस्सेदारी वाली इंडो स्पिरिट कंपनी ने शराब नीति में बदलाव से 192 करोड़ रुपये का मुनाफा कमाया है। कविता का बेनामी अरुण रामचन्द्र पिल्लई है।

హైదరాబాద్‌ : ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం 1100 కోట్ల నేరమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇవాళ దాఖలు చేసిన చార్జి షీట్ లో పేర్కొంది. 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని తెలిపింది. లిక్కర్ పాలసీ మార్పు ద్వారా MLC కవిత 33% భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీ 192 కోట్ల లాభాలు పొందిందని పేర్కొన్నది. కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఉన్నారని తెలిపింది.

2021–2022 ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు గాను రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ నాయర్ ద్వారా కవిత సమకూర్చారని చార్జీ షీట్ లో పొందు పర్చింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ ద్వారా డబ్బులు ఆప్ కు ఎలా వెళ్లాయి గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ కు ఎన్నికోట్ల ముడుపులు సమకూర్చారు అనే అంశాలను ప్రధానంగా చార్జిషీట్ లో ప్రస్తావించారు.

ఇది కూడ చదవండి-

లిక్కర్ స్కాం కేసులో ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2గా ఖావో గలీ రెస్టారెంట్, బబ్లీ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు. ఇండో స్పిరిట్ సంస్థ ఏ3గా పేర్కొన్నారు ఈడీ అధికారులు. ఈ డీల్ మొత్తంలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి. ఎవరెవరు పాల్గొన్నారు? డబ్బులను ఎలా మళ్లించారనే అంశాలను ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ 32 గా ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఏ 29గా ఉన్నారు.

లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జి షీట్ లో పేర్కొంది. మొత్తం 177 పేజీలతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో అనేక అంశాలను ఈడీ ప్రస్తావించింది.

ఇక ఈ కేసులో కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు మరో సారి పోడిగించింది. ఈడీ కేసులో కవితకు జూలై 3 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించగా. సీబీఐ కేసులో జూన్ 7 వరకు పొడిగించింది. జూన్ 7న సీబీఐ మరోసారి చార్జ్ షీట్ దాఖలు చేయనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X