हैदराबाद: मुख्यमंत्री केसीआर ने लोगों को उगादि पर्व की शुभकामानाएं दी है। सीएम ने कामना की कि यह उगादी, जिसे कृषि वर्ष माना जाता है, सभी क्षेत्रों में किसानों और लोगों के लिए सौभाग्य लेकर आए।
केसीआर ने कहा कि तेलंगाना में पीने के पानी, सिंचाई और हरी फसलों के साथ शाश्वत वसंत है। कृषि क्षेत्र के विकास के साथ, संबद्ध क्षेत्रों और व्यवसायों को मजबूत किया गया है और राज्य में ग्रामीण आर्थिक व्यवस्था को मजबूत किया गया है। तेलंगाना देश की तरक्की की मिसाल बन गया है। केसीआर की विश्वास व्यक्त किया कि देश के साथ-साथ तेलंगाना भी शोभकृत नाम के वर्ष में और अधिक विकास हासिल करे।
తెలంగాణలో నిత్య వసంతం : ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శోభకృత్ నామ ఉగాది పండుగ (Ugadi Festival) శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి అని సీఎం ఆకాంక్షించారు.
తాగు, సాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొంది అని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైంది. తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచింది. శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు దేశం మరింత అభివృద్ధి సాధించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శంగా నిలుస్తోందని అన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డి, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శోభాకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరం లో ప్రజలు అన్ని విధాలుగా విజయాలు సాధించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చి ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతాం.. రేవంత్ రెడ్డి.
గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగు సంవత్సరాది “శోభకృ త్ ఉగాది పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగు సంవత్సరాది “శోభకృ త్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు సంవత్సరం ప్రజలందరికీ కలిసి వచ్చి అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
వద్దిరాజు రవిచంద్ర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలు, దేశవిదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సహా యావత్ దేశం అన్ని రంగాలలో మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర అభిలషించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

ఈ తెలుగు సంవత్సరంలో రైతులకు, మహిళలకు, కార్మికులకు, యువతకు మంచి జరగాలని… అన్ని రంగాలలో విజయం చేకూరాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. తెలుగు సంవత్సరం ప్రధానంగా రైతులకు వర్షాలు బాగా పడి పంట దిగుబడి బాగా రావాలని వ్యవసాయ రంగంలో లాభాలు రావాలని రైతులకు లాభం చేకూరాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలకు అష్టైశ్వర్యాలు, వ్యవసాయ అనుబంధం లో పనిచేసే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను