డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎస్సి/ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం (One More News)

హైదరాబాద్ : డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం SC/ST ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు డా . బి. ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశములో వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది.

ముఖ్యంగా డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఆచార్య ఘంటా చక్రపాణి గారిని నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఆచార్య ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు ఉపకులపతికి సమావేశం కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

విశ్వవిద్యాలయ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కారించే విషయంలో ఉపకులపతి మరియు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి ప్రతేక చొరవ చూపడంతో సమావేశం ధన్యవాదాలు తెలపడం జరిగింది. విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ తేవడంతో పాటు విశ్వవిద్యాలయం అభివృద్ధిపథంలో నడుపుతున్న ఉపకులపతి, రిజిస్ట్రార్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ పర్యవేక్షణలో ఉపాధ్యక్షులు డి. వసంతరావు మరియు సంయుక్త కార్యదర్శి మాలోతు బుద్ధ, కోశాధికారి డి. రెడ్ద్య నాయక్, డి. దేవుల, ఎన్. లక్ష్మయ్య మరియు కార్యవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ పవర్, బోజు శ్రీనివాస్, చంద్రకళ, కె. ప్రేమ్ కుమార్, యాకేశ్, ఉదయాని, బి. పాండు,మంజుల, రుషేనద్రమని, సుహాసిని ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

BRAOU MBA & MBA (HHCM) ENTRANCE TEST POSTPONED

Hyderabad: Dr. B. R. Ambedkar Open MBA & MBA (Hospital and Healthcare Management) Entrance Test-2025 scheduled on August 10, 2025 is postponed to August 24, 2025 due to technical reasons. The last date extended for ‘Online Registration’ till August 14, 2025.

BRAOUMBAET will be conducted on August 24, 2025 (Sunday). The timing of examination 2:00 pm to 3:30 pm at specified centres located in the Telangana. For more details visit university portal: www.braouonline.in or www.braou.ac.in.

Also Read-

ఎం.బి.ఏ, ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా

హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.బి.ఏ; ఎం.బి.ఏ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఎంట్రన్స్ టెస్ట్ ను ఆగష్టు 24వ తేదీ కి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల ఆగష్టు 10వ తేది (ఆదివారం) జరగాల్సిన పరీక్షను సాంకేతిక కారణాలతో నెల ఆగష్టు 24వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.

ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగష్టు 14 అని పేర్కొన్నారు. అలాగే ఆగష్టు 24వ తేదీన మధ్యాహ్నం 2:00 నుండి 3:30 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్ సైట్ www.braou.ac.in సంప్రదించొచ్చని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X