యుద్ధం మిగిలే ఉన్నది: కేసీఆర్

భూమి పుత్రుడు పుస్తకం ఆవిష్కరణ
( సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ )

హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం కు శ్రీకర చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకికరణ చేసి కార్యక్షత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.

రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ ఎడిటోరియల్‌ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్‌ ఆఫ్‌ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని కేసీఆర్‌ శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీఆర్‌ఎస్‌ అధినేత గోసుల ్రశీనివాస్‌యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతి సాధారణ శైలిలో,ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంశించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని, రచయితలు ప్రజల పక్షాన ఉండాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో బావ వ్యాప్తి తో ఉద్యమం ఉదృతమైందని గుర్తు చేస్తూ మరోసారి కవులు కళాకారులు ఏకం కావలసిన అవసరాన్ని గుర్తు చేశారు. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ను ఇప్పటికి కాంగ్రెస్ సర్కారు తిరుగమన దిశగా ఆలోచించడాన్ని కెసిఆర్ తప్పు పట్టారు.

కర్షకులు కార్మికులు నిరుద్యోగులు వివిధ వర్గాలు కాంగ్రెస్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజల కు చిన్న ఇబ్బంది కలగకుండా చేశారని ఈ సందర్భంగా కేసీఆర్ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. కార్య్రకమంలో మాజీ మం్రతి వర్యులు హరీశ్‌రావు, బాలమల్లు, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X