హైదరాబాద్: ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిలకలుడాలోని ఆఫీసులో ఈరోజు గణతంత్ర దివస్ దినం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ జి. నాగేశ్వరరావు, ఆసరా వైస్ ప్రెసిడెంట్, హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ తర్వాత జరిగిన సభకి కే ఎన్ స్వామి అధ్యక్ష వహించారు.
సభను ఉద్దేశించి ముఖ్య అతిథి జి నాగేశ్వరావు గారు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే రకంగా ఈరోజు పెన్షనర్లు సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యలు వారికోసం చేసే కొన్ని కార్యక్రమాలు ప్రతిపాదనలు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఆసరా కార్యక్రమాలు నియర్ సిటిజనుల కోసం కొరి కార్యక్రమాలు డేకేర్ సెంటర్లు లాంటివి చేస్తున్నాయి అని చెప్పారు. ఏఐఆర్ఎఫ్ చేసే కార్యక్రమానికి తమ పూర్తి మద్దతుండని పేర్కొన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీధర్ ఫెడరేషన్ ఆలిండియా అధ్యక్షుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని నొక్కి చెప్పారు. శ్రీ కే శివకుమార్ జాయింట్ జోనల్ సెక్రెటరీ రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని సభ చేత చదివించారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మన హక్కుల్ని సంరక్షించాలని నినాదాలు ఇవ్వడం జరిగింది. తన్వి అనే చిన్నమ్మాయి తమ గానంతో నృత్యంతో గణతంత్ర దినం యొక్క లక్ష్యాన్ని ప్రదర్శించారు. సభలో యుగంధర్, సుధాకర్ రావు, ఎం సి రాజు, గిరిజ,బాబురావు, రాజేంద్ర పాల్, పివిలు, ముత్తయ్య, గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
