కర్నూలులో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా కొత్త కోర్సు ప్రారంభానికి ప్రతిపాదనలు
కర్నూలు : క్లస్టర్ యూనివర్సిటీకి చెందిన కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు కళాశాలలోని అసెంబ్లీ హాల్ లో నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. దేవికా రాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
గణితశాస్త్ర విభాగం తరఫున MSc గణితశాస్త్రం మరియు కంప్యూటింగ్ అనే ప్రత్యేక కోర్సును ప్రారంభించేందుకు క్లస్టర్ యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపినట్లు డాక్టర్ బి. దేవికా రాణి తెలిపారు. ఈ కొత్త కోర్సు ద్వారా విద్యార్థులకు గణితశాస్త్రంతోపాటు కంప్యూటింగ్ నైపుణ్యాలలో ప్రావీణ్యత పెంపొందించే అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
Also Read-
ముఖ్య అతిథి మరియు ప్రదర్శనలకు న్యాయ నిర్ణేతగా హాజరైన శ్రీ ప్రభు చరణ్ (గణిత శాస్త్ర అధ్యాపకుడు) ప్రేరనాత్మక కథలతో విద్యార్ధినులకు స్ఫూర్తి నిచ్చారు, ఈ కోర్సు ద్వారా విద్యార్థులు గణితశాస్త్రం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలకు మరియు కంప్యూటర్ సంబంధిత నైపుణ్యాల పెంపుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భవిష్యత్ అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 100కి పైగా కెవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని, గణితశాస్త్రంపై స్ఫూర్తి పొందారు. MSc గణితశాస్త్రం మరియు కంప్యూటింగ్ కోర్సు ప్రారంభం కళాశాల అభివృద్ధిలో మరో అడుగుగా నిలుస్తుందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు మరియు పజిల్స్ ప్రదర్శనలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం పుస్తక ప్రదర్శన, భారతీయ పాత నాణేల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.