हैदराबाद : राजन्ना सिरिसिला जिले के वेमुलावाड़ा में कुछ समय से अपने आपको ज्योतिष बता रहे एक पुजारी ने कई लोगों से 2 करोड़ रुपये वसूल करे और फरार हो गया। इसके चलते कर्जदारों ने पुलिस से शिकायत दर्ज की है। शहर के मार्कंडेयनगर मार्ग पर ज्योतिषी की दुकान चलाने वाले पद्मशाली समुदाय के महेश पुजारी का भी काम करते हैं।
महेश कई लोगों के घरों में पूजा कार्यक्रम करता था जो उनके पास ज्योतिष के लिए आते थे। उसने कई लोगों को यह उम्मीद दिखाकर 2 करोड़ रुपये तक जुटाए कि वह कई व्यवसायों में निवेश कर रहा है और अधिक ब्याज देगा।
इसी बीच कुछ दिनों से ज्योतिषी शॉप के बंद होने और फोन स्वीच आने पर पूछताछ की गई तो असली बात सामने आ गई। कर्जदारों ने पुलिस से संपर्क किया और शिकायत दर्ज करवाई। टाउन सीआई वीरा प्रसाद ने बताया कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है।
यह भी पढ़ें-
2 కోట్లతో ఊడాయించిన వేములవాడ పూజారి
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొంత కాలంగా జ్యోతిష్యం చెబుతున్న ఓ పూజారి పలువురి వద్ద రూ.2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మార్కండేయనగర్ వీధిలో ఓ జ్యోతిష్యాలయం నిర్వహించే పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహేశ్ పూజారిగా కూడా పనిచేస్తున్నాడు.
తన దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవారితో పాటు పలువురి ఇండ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. తాను పలు బిజినెస్లలో పెట్టుబడులు పెడుతున్నానని, అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపి పలువురి వద్ద 2 కోట్ల వరకు వసూలు చేశాడు.
కొద్ది రోజులుగా జ్యోతిష్యాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ వీరా ప్రసాద్ చెప్పారు. (ఏజెన్సీలు)